SSY Account Transfer: సుకన్య సమృద్ధి ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవడం ఎలా?

|

May 01, 2022 | 8:12 AM

SSY account transfer: కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్‌ను ప్రవేశపెడుతోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పలు రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం ..

SSY Account Transfer: సుకన్య సమృద్ధి ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవడం ఎలా?
Sukanya Samriddhi Account
Follow us on

SSY account transfer: కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్‌ను ప్రవేశపెడుతోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పలు రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం (Central Government). ఇక కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌ కూడా ఒకటి. ఈ పథకంలో పదేళ్లలోపు ఉన్నవారి ఆడ పిల్లలను చేర్చవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీమ్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది. అమ్మాయిల పేరుపై సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌ కింద అకౌంట్‌ తీయవచ్చు.

ఈ ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు..

ఈ సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌ అకౌంట్‌ను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఎలాంటి రిస్క్‌ లేకుండా సులభంగానే మార్చుకోవచ్చు. బ్యాంకు వెబ్‌సైట్ల వివరాల ప్రకారం.. కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి సుకన్య సమృద్ది యోజన అకౌంట్‌ను వేరే బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు. ముందుగా అకౌంట్‌ను వేరే బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు రిక్వెస్ట్ పెట్టుకుంటే ఖాతా వేరే బ్యాంకుకు బదిలీ అయిపోతుంది. అకౌంట్‌ ఉన్న బ్యాంకుకు వెళ్లి బ్యాంకు సిబ్బంది అడిగిన పత్రాలు అందించాల్సి ఉంటుంది. అప్పుడు వారు మీ బ్యాంకు సర్టిఫైడ్‌ కాపీ ఆఫ్‌ ద అకౌంట్‌, అకౌంట్‌ ఓపెనింగ్‌ ఆప్లికేషన్‌, డీడీ లేదా చెక్కు వంటి డాక్యుమెంట్లు అందిస్తారు. వీటిని మీరు మార్చుకునే బ్యాంకుకు అందిస్తే సరిపోతుంది.

దాదాపు అన్ని బ్యాంకులకు ఇదే ప్రాసెస్‌..

ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌కు సంబంధించిన అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రాసెస్‌ దాదాపు అన్ని బ్యాంకులలో ఇకేలా ఉంటుంది. అకౌంట్‌ను మార్చుకునే బ్యాంకుకు వెళ్లి అక్కడ కొత్త ఫామ్‌ నింపాల్సి ఉంటుంది. అవసరమైన కేవైసీ డాక్యుమెంట్లు సమర్పంచాలి. ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది ప్రాసెస్‌ అనంతరం అకౌంట్‌ ఒక బ్యాంకు మీరు సూచించే బ్యాంకుకు మారిపోతుంది. ఏవైనా సందేహాలుంటే ముందుకు బ్యాంకు సిబ్బందిని అడిగితే పూర్తి వివరాలు చెబుతారు.

ఈ స్కీమ్‌లో పన్ను మినహాయింపు:

అయితే ఇందులో పలు రకాల బెనిఫిట్స్‌ ఉన్నాయి. ఈ స్కీమ్స్‌లో పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్‌ 80c కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తంలో పొందవచ్చు. ఇందులో స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ల కన్నా ఈ స్కీమ్‌లో అధిక వడ్డీని పొందవచ్చు. ఆడ పిల్లల పెళ్లళ్ల నిమిత్తం, ఉన్నత చదువుల నిమిత్తం ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇందులో ఎలాంటి మోసం లేకుండా మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్‌కు పూర్తి భద్రత ఇస్తుంది ప్రభుత్వం. ఈ స్కీమ్‌లో చేరాలంటే బ్యాంకులలోనే కాకుండా పోస్టాఫీసుల్లో కూడా ఖాతా తెరిచి డబ్బులను ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. సంవత్సరంలో రూ.250 డిపాజిట్‌ కూడా చేసే వెసులుబాటు ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

LPG Gas Cylinder Price: వినియోగదారులకు షాక్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..!

Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయంటే..!