Amrit Bharat Weekly Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రేపటి నుంచే ప్రారంభం.. రూట్, టైమింగ్స్ ఇవే..

దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అందించింది. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుంది. చర్లపల్లి నుంచి ఏపీ, తమిళనాడు మీదుగా కేరళకు ప్రయణించనుంది. ఈ రైలు వివరాలు ఇలా..

Amrit Bharat Weekly Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రేపటి నుంచే ప్రారంభం.. రూట్, టైమింగ్స్ ఇవే..
Amrut Bharat Train

Updated on: Jan 22, 2026 | 1:48 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. మరో కొత్త రైలును అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నంచి ఏపీ, తమిళనాడు మీదుగా తిరువనంతపురం వరకు అమృత్ భారత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. జనవరి 23వ తేదీ నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుండగా.. రెండు రాష్ట్రాల ప్రజలను ఉపయోగం జరగనుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం దేశవ్యాప్తంగా దశలవారీగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేంద్రం తీసుకొచ్చింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రైళ్లను ప్రవేశపెట్టగా.. ఇప్పుడు మరో రైలు అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ సమయాలు, వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.

ఈ ప్రాంతాల మీదుగా..

తిరువనంతపురం-చర్లపల్లి(17401/17042) అమృత్ భారత్ రైలును ఈ నెల 23న ప్రారంభించనున్నారు. ప్రారంభం రోజున ఇది తిరువనంతపురంలో ఉదయం 10.45 గంటలకు బయల్దేరి.. తర్వాతి రజు 16.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. త్వరలో ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు షెడ్యూల్‌ను రైల్వేశాఖ విడుదల చేయనుంది. తిరువనంతపురం, ఎర్నాకుళం, పాలక్కాడ్, కొట్టాయం, కొల్లం, కాట్పాడి, సేలం, ఈ రోడ్ మీదుగా ఏపీకి చేరుకుంటుంది. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా చర్లపల్లికి చేరుకుంటుంది.

క్లాసుల వివరాలు ఇవే..

8 స్లీపర్ కోచ్‌లు, 11 జనరల్ కోచ్‌లు, ప్యాంట్రీ కార్ కోచ్ 1, రెండు సెకండ్ క్లాస్ కోచ్‌లు ఇందులో ఉంటాయి. ఈ రైలుకు ముందు భాగంలో ఒకటి, వెనుక భాగంలో ఒక ఇంజిన్ ఉంటుంది. దీని వల్ల వేగంగా వెళ్లడమే కాకుండా కుదుపులు లేని ప్రయాణం చేయవచ్చు.