New Rules From 1 December: డిసెంబర్ 1 వచ్చేస్తోంది.. మీ ఖర్చులు తగ్గనున్నాయి.. ఎందుకో తెలుసా..

|

Nov 28, 2021 | 12:05 PM

డిసెంబర్ 1 నుంచి కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఈ ప్రభావం మీ పాకెట్‌ మనీ పై పడనుంది.  కొత్తగా LPG సిలిండర్ ధరలు, UAN- ఆధార్‌ను లింక్..

New Rules From 1 December: డిసెంబర్ 1 వచ్చేస్తోంది.. మీ ఖర్చులు తగ్గనున్నాయి.. ఎందుకో తెలుసా..
December 1
Follow us on

New Rules From 1 December: డిసెంబర్ 1 నుంచి కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఈ ప్రభావం మీ పాకెట్‌ మనీ పై పడనుంది.  కొత్తగా LPG సిలిండర్ ధరలు, UAN- ఆధార్‌ను లింక్ చేయడానికి గడువుతోబాటు SBI క్రెడిట్ కార్డ్, హోమ్‌లోన్‌తో EMIలో కొనుగోలు చేయడం చాలా ఖరీదైనదిగా మానుంది. ఎల్‌పిజి సిలిండర్ ధరలను ప్రకటించడంతో బ్యాంకింగ్, పెన్షన్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలు కూడా మారబోతున్నాయి. అయితే డిసెంబర్ 1 నుంచి ఎల్పీజీ ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

EPFO ఇప్పటికే UAN- ఆధార్‌లను లింక్ చేయడానికి గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది కేంద్రం. అందుతున్న సమాచారం ప్రకారం సమయం పెంచే అవకాశం లేదు. ఈ సందర్భంలో ఇంకా UAN-ఆధార్‌కు లింక్ చేయని వారు డిసెంబర్ 1 లోపు పనిని పూర్తి చేయాలి. లేదంటే పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వాస్తవానికి గడువులోపు UAN-ఆధార్‌ను లింక్ చేయకపోతే  చందాదారుల ఖాతాలకు PF జమ చేయబడదు. చందాదారులు కూడా PF ఖాతా నుండి విత్‌డ్రా చేయలేరు.

నవంబర్ 30లోగా యూఏఎన్-ఆధార్ లింక్ చేసుకోని వారు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. EPFO కూడా ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) కోసం UAN-ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అలా చేయడంలో విఫలమైతే ఉద్యోగికి ప్రీమియం చెల్లించకపోవడమే కాకుండా రూ. 7 లక్షల వరకు బీమా రక్షణ కోల్పోతారు.

SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ఇది డిసెంబర్ నుండి మారబోతోంది. SBI క్రెడిట్ కార్డ్‌తో EMIలో కొనుగోలు చేయడం మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఇప్పటి వరకు SBI కార్డ్‌లపై వడ్డీ మాత్రమే వసూలు చేయబడింది. కానీ ఇప్పుడు EMIలో కొనుగోళ్లకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఇది SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

గృహ రుణాల విషయానికి వస్తే.. చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పండుగ సీజన్‌లో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ ఆఫర్‌లు సరసమైన వడ్డీ రేట్ల నుండి ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపుల వరకు ఉంటాయి. అయితే, చాలా బ్యాంక్ ఆఫర్‌లు డిసెంబర్ 31, 2021 వరకు చెల్లుబాటులో ఉంటాయి. అయితే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఆఫర్ గడువు ఈ నెలతో ముగుస్తుంది. వాస్తవానికి కంపెనీ వినియోగదారులకు నవంబర్ 30తో ముగుస్తోంది. అంటే రూ.2 కోట్ల లోపు రుణాలపై 6.66 శాతం గృహ రుణం పొందడానికి ఛాన్స్ ఉంది.

ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30 అని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ గడువులోపు జీవిత ధృవీకరణ పత్రం సమర్పించలేని ప్రభుత్వ పింఛనుదారులకు ఇకపై పింఛను అందదు. EPFO ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం.. ప్రభుత్వ పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి నవంబర్ 30 వరకు గడువు ఉంది. ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ఇంట్లో కూర్చొని ఈ పనిని డిజిటల్‌గా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి.. చాణక్యనీతిలో సంచలన విషయాలు..

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..