Banking Services: ఇంటి నుంచే బ్యాంకింగ్ సేవలు.. మొబైల్ ఉపయోగించి పొందే సేవల వివరాలివే..

|

Dec 26, 2022 | 10:55 AM

WhatsApp Banking: బ్యాంకింగ్ సేవలు పొందాలంటే.. బ్యాంకుకు వెళ్లి.. క్యూలైన్లో నిల్చుని.. మన టైం వచ్చినప్పుడు సేవలు పొందాల్సి వచ్చేది.. కనీసం మన ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా.. పాస్ బుక్‌ పట్టుకుని.. బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవల్సి వచ్చేది. కాలం మారుతోంది. టెక్నాలజీ ఎంతో

Banking Services: ఇంటి నుంచే బ్యాంకింగ్ సేవలు.. మొబైల్ ఉపయోగించి పొందే సేవల వివరాలివే..
Whatsapp Banking Services
Follow us on

WhatsApp Banking: బ్యాంకింగ్ సేవలు పొందాలంటే.. బ్యాంకుకు వెళ్లి.. క్యూలైన్లో నిల్చుని.. మన టైం వచ్చినప్పుడు సేవలు పొందాల్సి వచ్చేది.. కనీసం మన ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా.. పాస్ బుక్‌ పట్టుకుని.. బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవల్సి వచ్చేది. కాలం మారుతోంది. టెక్నాలజీ ఎంతో డెవలప్‌ అవుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుండటంతో.. పలు సేవలు పొందడం చాలా ఈజీ అయిపోతుంది. దీనికి బ్యాకింగ్ రంగం కూడా అతీతం కాదు. గతంలో బ్యాంకింగ్ సేవలకు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మారుతున్న కాలం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ బ్యాంకింగ్ రంగం తన సేవలను సులభం చేస్తోంది. ఇప్పటికే చాలా బ్యాంకులు వాట్సప్ సేవలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలైన యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రకమైన సేవలను అందిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్, ఎస్‌బిఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా మినీ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్‌‌ను ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ మినీ స్టేట్‌మెంట్‌లో కస్టమర్ చివరి ఐదు లావాదేవీల వివరాలను బ్యాంకులు అందిస్తున్నాయి.

SBI వాట్సప్ బ్యాంకింగ్ సేవలు పొందడం ఎలా

SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను పొందడానికి ముందుగా ఖాతాదారులు తన ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి. దీని కోసం SMS ద్వారా కస్టమర్ తన అంగీకారాన్ని తెలయజేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రిజిస్టర్ కాని వారు సేవలు పొందేందుకు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. SBI ఖాతాదారులు బ్యాంక్‌ ఖాతాకు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి A/c నెంబర్ ను 72089333148కి SMS పంపించాలి. ఈ సేవలకు సంబంధించిన షరతులను Bank.sbiలో వీక్షించవచ్చు. వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత.. 9022690226 నెంబర్ కు వాట్సప్ లో హాయ్ అని పంపాలి. లేదా SBI నుంచి WhatsApp ద్వారా వచ్చిన సందేశానికి రీప్లై ఇవ్వవచ్చు. మీ నుంచి మెసెజ్ వెళ్లిన తర్వాత ప్రియమైన కస్టమర్ SBI Whatsapp బ్యాంకింగ్ సేవలకు స్వాగతం.. దయచేసి దిగువన ఉన్న ఏవైనా ఎంపికల నుండి ఎంచుకోండి అని రిప్లే వస్తుంది. అందులో 1. ఖాతా బ్యాలెన్స్, 2. మినీ స్టేట్‌మెంట్, 3. WhatsApp బ్యాంకింగ్ నుండి డి-రిజిస్టర్ చేసుకోండి అనే ఆప్షన్లు డిస్ ప్లే అవుతాయి. మనకి కావలసిన సర్వీస్ ఆప్షన్ పై క్లిక్ చేసి అవసరమైన సేవలను పొందవచ్చు.

యూనియన్ బ్యాంకు వాట్సాప్ సేవలను పొందడం ఎలా

యూనియన్ బ్యాంకు వినియోగదారులైతే ఖాతాకు లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి వాట్సప్‌లో హాయ్ అని టైప్ చేసి.. 9666606060 నెంబర్‌కు పంపించాలి. మొదటిసారి ఈ సేవల కోసం రిజిస్టర్ చేసుకునే ఖాతాదారులైతే హాయ్ అని పంపగానే మీకు అనువైన భాషను ఎంచుకోమని ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తెలుగు, బెంగాళీ, మరాఠి, తమిళ భాషలను సూచిస్తుంది. బాషను ఎంచుకున్న తర్వాత.. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత.. రిజిస్ట్రేషన్ విజయవంతమైంది. ఎమ్‌ పిన్‌, టిపిన్‌ సెట్ చేసుకోమని ఓ లింక్ వస్తుంది. ఆ లింక్ పై క్లిక్‌ చేసి పిన్స్ సెట్ చేసుకున్న తర్వాత.. ఎమ్‌పిన్‌, టిపిన్‌ విజయవంతం అనే సందేశం వాట్సప్‌కు వస్తుంది. ఆ తర్వాత.. నుంచి సేవలను ఉపయోగించుకోవచ్చు. సేవలను ఎప్పుడైతే ఉపయోగించుకోవాలనుకుంటే అప్పుడు.. వాట్సప్‌ నుంచి 9666606060 నెంబర్‌కు హాయ్ అని పింపించాలి. ఆ తర్వాత మీ ఎమ్‌పిన్‌ను ధృవీకరించండి లేదా ఫర్‌గెట్‌ ఎమ్‌పిన్‌ అని అడుగుతుంది. ఎమ్‌పిన్‌ తెలిసినట్లైతే 1 అనే నెంబర్ ఎంటర్‌ చేస్తే ఓ లింక్ వస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేసి ఎమ్‌పిన్‌ ఎంటర్ చేసిన తర్వాత.. ఎమ్‌పిన్ ధృవీకరణ విజయవంతమైంది. కింది ఆప్షనలలో అవసరమైన దానిని ఎంచుకోమని సూచిస్తూ.. ఎంక్వైరీ, రిక్వెస్ట్స్, అగ్జిలరీ సర్వీసెస్‌, అకౌంట్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఇలా వచ్చిన ఆప్షన్‌లలో అవసరమైన దానిని ఎంచుకుని సేవలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం చూడండి..