Indian Elon Musk: ట్విట్టర్ బోర్డు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు కంపెనీని విక్రయించడానికి అంగీకరించినప్పటి నుంచి విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. అంతరిక్ష ప్రయాణం, మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను రూపొందించడం వంటి ప్రతిష్టాత్మక ప్రణాళికలతో దూరదృష్టి గల వ్యవస్థాపకుడిగా ఎలాన్ మస్క్ పరిగణించబడుతున్నారు. ఎలాన్ మస్క్ వంటి టెక్ లీడర్ భారతదేశంలో ఉన్నారా అనే ప్రశ్నకు ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ CEO కునాల్ బహ్ల్ ఇలా సమాధానం ఇస్తున్నారు.
ఇటీవల లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తాను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని భారతదేశానికి చెందిన ఎలాన్ మస్క్‌గా భావిస్తున్నానని బహ్ల్ చెప్పారు. దేశంలోని పౌరులందరికీ ఆధార్ బయోమెట్రిక్- IDలను రూపొందించేందుకు ప్రభుత్వం చేసిన భారీ ప్రయత్నానికి నీలేకని నాయకత్వం వహించారు. దీనికి తోడు దేశాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు నడిపేందుకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అందరికీ చేరువచేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రాజెక్టులు చర్చకు దారితీశాయి. ఆధార్ భద్రత, డేటా గోప్యత గురించి ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. UPIకి సంబంధించిన అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది.
ఇప్పుడు నీలేకని డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్‌ను రూపొందించడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు.ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ప్రత్యర్థిగా లాభాపేక్షలేని ఒక ప్రభుత్వ వేదికను నిర్మించేపనిలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి ప్రభావవంతమైన ప్రాజెక్ట్‌ల కారణంగా.. దేశంపై నీలేకని ప్రభావం, విదేశాలలో దాని స్థానం “nothing short of incredible” అని బహ్ల్ కితాబిచ్చారు. ఆయన చర్యలు దేశంలోని బిలియన్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. నీలేకరి పర్సనాలిటీ, విధానం ఎలాన్ మస్క్ కు భిన్నంగా ఉంటాయి. కానీ.. నీలేకరి చేస్తున్న పనుల ప్రభావం మాత్రం మస్క్ లాగానే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్నాయని Snapdeal CEO అంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Srilanka Crisis: శ్రీలంక ప్రజలకు మరో షాక్.. ఆ మందుల రేట్లు భారీగా పెంచిన ప్రభుత్వం..
Crime News: ట్యాక్సీడ్రైవర్ దాష్టీకం.. తల్లితో సహజీవనం చేస్తూనే కుమార్తెపై అత్యాచారం..