
కొంతమంది మంచి జీతానికి ఉద్యోగం చేస్తుంటారు. ఠంచనుగా ఒకటో తేదీనే ఐదెంకల జీతం అందుకుంటారు. కానీ నెలాఖరుకు వచ్చేసరికి అప్పులు చేస్తుంటారు. అందుకు కారణం కొన్ని దుబారా ఖర్చులు కారణం కావొచ్చు. బయట తినడం, ఆహారం డెలివరీ చేయడం, హఠాత్తుగా ఆన్‌లైన్ షాపింగ్ చేయడం ఇవి వేరియబుల్ ఖర్చులు. వీటిని తగ్గించడం వల్ల వెంటనే మీ చేతిలో డబ్బు కనిపిస్తుంది కానీ, వాటిని మళ్లీ ప్రారంభిస్తే మునుపటి పరిస్థితే మళ్లీ వస్తుంది. అలా కాకుండా కచ్చితంగా కొన్ని ఖర్చులను కట్ చేస్తే మీ జేబు ఎప్పుడూ డబ్బుతో కళకళలాడుతూ ఉంటుంది.
స్ట్రీమింగ్ సర్వీస్‌లు, యాప్‌లు, ప్రీమియం మెంబర్‌షిప్‌లు, మీరు అరుదుగా ఉపయోగించే క్లౌడ్ స్టోరేజ్. విడివిడిగా, అవి చిన్నవిగా కనిపిస్తాయి. కానీ అన్ని కలిపితే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ప్రయాణాలు. విచక్షణతో కూడిన విహారయాత్రలను వాయిదా వేయడంతో కూడా మీరు డబ్బు ఆదాయ చేయొచ్చు.
EMI చెల్లించడంలో అస్సలు ఆలస్యం చేయకండి. వాటిని కట్టకంటే అదనపు వడ్డీ రూపంలో ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే EMIలు సకాలంలో కట్టేయండి. క్రెడిట్ కార్డులపై కనీస బకాయిలను మాత్రమే చెల్లించకుండా పూర్తిగా క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. వడ్డీ రూపంలో చాలా డబ్బు సేవ్ అవుతుంది. అలాగే ఏ ప్రీమియం వస్తువు కొనే ముందు అయినా సరే కచ్చితంగా అది అసవరమా లేదా అని ఒకటి పది సార్లు ఆలోచించండి. కచ్చితంగా అసవరం అయితేనే కొనండి. లేదంటే తర్వాత కొందాలనే అని వాయిదా అయినా వేయండి.
అలాగే ఆర్థిక ఇబ్బందుల ఉన్నాయి కదా అని పెట్టుబడులు పెట్టడం మానేయకండి. స్వల్ప కాలిక ఇబ్బందులను తీర్చుకోవడానికి దీర్ఘకాల ప్రయోజనాలను దెబ్బతీయకూడదు. ఉదాహరణకు మీరు ప్రతినెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా కొంత పొదుపు చేస్తుంటే ఇతర అవసరాల కోసం వాటిని ఉపయోగించకండి. దీని వల్ల మనకు భవిష్యత్తులో అంతగా ఉపయోగం లేదో దానిపై ఖర్చు తగ్గించండి. అంతేకానీ భవిష్యత్తులో ఆదుకునే పొదుపులను మాత్రం నిలిపివేయకండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి