AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: లాభాల పంట.. మ్యాజిక్‌ చేసిన టాటా స్కీమ్‌.. రూ.10 వేలతో చేతికి 14 లక్షలు!

మంచి లాభాలు రావాలంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమమని అంటున్నారు ఫండ్‌ నిపుణులు. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌, తక్కువ కాలంలో మంచి రాబడి పొందవచ్చని చెబుతున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో వివిధ రకాల ఫండ్స్‌ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి అవగాహన ఉండి మంచి లాభాలు అందించే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఊహించనంత రాబడి అందుకోవచ్చంటున్నారు.

Mutual Funds: లాభాల పంట.. మ్యాజిక్‌ చేసిన టాటా స్కీమ్‌.. రూ.10 వేలతో చేతికి 14 లక్షలు!
Subhash Goud
|

Updated on: Oct 24, 2024 | 12:06 PM

Share

మంచి ఆదాయం పొందేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. మంచి ఫండ్స్‌లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే అదిరిపోయే లాభాలు పొందవచ్చు. చాలా మంది మంచి లాభాలు పొందేందుకు మ్యూచువల్ ఫండ్ల మీరు పెట్టుబడులు పెడుతుంటారా? ఇందులో మంచి రాబడి ఇచ్చే పథకాలను ఎంచుకుంటే లక్షలాదికారి కావచ్చు. మరి ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ పథకాల్ని ఎంచుకుంటారనేది చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్, లార్జ్ క్యాప్, కాంట్రా, ఇండెక్స్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇలా ఎన్నో రకాల ఫండ్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇలా రకరకాల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ స్టాక్స్‌ నుంచి రిటర్న్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లతో లింక్ అయి ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఉంటుందనే చెప్పాలి. అయితే దీర్ఘకాలంలో పెట్టుబడులపై మాత్రం మంచి రాబడి ఆశించవచ్చు.

ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ పనిచేయడంతో.. లాంగ్ రన్‌లో మంచి రాబడి వస్తుంది. ఇప్పుడు మనం స్మాల్ క్యాప్ ఫండ్లలో రాబడి గురించి ఇక్కడ గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లు మంచి లాభాలు పొందారు. గత ఐదేళ్లలో 5 స్మాల్ క్యాప్ స్కీమ్స్.. సంపదను 2.25 రెట్లకు పైగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: 5G Speed: తుస్సుమనిపించిన 5జీ స్పీడ్‌.. రెండేళ్ల తర్వాత షాకింగ్‌ రిపోర్ట్‌..!

ఇవి కూడా చదవండి

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్:

గత ఐదు సంవత్సరాల కాలంలో వార్షిక ప్రాతిపదికన 43.50 శాతం మేర రిటర్న్స్ అందించింది. నెలకు రూ.10 వేల చొప్పున సిప్ చేసిన వారికి.. 5 సంవత్సరాల్లో రూ.17 లక్షలు అందుకున్నారు. ఇక్కడ 2.83 రెట్ల మేర రిటర్న్స్ అందుకున్నారు. ఇక నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లాభాలు 2.53 రెట్ల వరకు పెరిగింది. వార్షికంగా చూస్తే 38.57 శాతం రిటర్న్స్ అందాయి. దీంతో నెలకు రూ. 10 వేలు పెడితే.. ఐదేళ్లకు అది రూ. 15.20 లక్షలు.

ఇది కూడా చదవండి: BSNL New Logo: బీఎస్‌ఎన్‌ఎల్‌ లోగో మారింది.. యూజర్ల కోసం సరికొత్త నిర్ణయాలు!

టాటా స్కీమ్‌:

ఇందులో భాగంగా టాటా స్కీమ్ కూడా ఒకటి ఉంది. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ సంవత్సరానికి సగటున 35.66 శాతం మేర లాభాలు ఇచ్చింది. దీనిలో ప్రతి నెలా రూ.10 వేలు పెట్టుబడి పెట్టిన వారికి ఐదు సంవత్సరాలలో రూ.14.21 లక్షల రాబడి పొందారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ పేర్కొన్న కాలంలో SIP పెట్టుబడులను 2.33 రెట్లతో 34.90 శాతం XIRR(Extended Internal Rate of Return)తో రూ.13.97 లక్షలకు చేరుకుంది.

టాటా స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్‌ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ అదే SIP పెట్టుబడులను వరుసగా 2.37 రెట్లు, 2.36 రెట్లు పెంచాయి. పథకాలు వరుసగా 35.66 శాతం, 35.42 శాతం అందించాయి.

ఇది కూడా చదవండి: Cash Withdrawal: బ్యాంకుకు వెళ్లకుండానే ఆధార్‌తో ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా.. ఎలాగో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి