MSME Loan: ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం చేయటం కంటే సొంతంగా వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి బ్యాంకులు సైతం అనేక పథకాల కింద లోన్స్ అందిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యాపార స్థాపన తరువాత అవసరమైన సలహాలు సూచనలు వంటివాటిని కూడా అందిస్తున్నాయి. తాజాగా..స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ‘ARISE’ చొరవ కింద.. MSME కేటగిరీ బ్రౌన్‌ఫీల్డ్ యూనిట్ల ఏర్పాటుకు సులభ నిబంధనలు, రాయితీపై రుణాలను అందిస్తోంది. కేవలం రుణాలు ఇవ్వటం మాత్రమే కాక వారి వ్యాపార వృద్ధికి కూడా సహాయపడుతోంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ వెెసులుబాటును వినియోగించుకునేందుకు జూలై 31 వరకు గడువు ఉంది.
అర్హతలు:
ప్రభుత్వ ప్రాధాన్యత, అధిక వృద్ధి రంగాల్లో వ్యాపారం ఉన్న MSMEలను లక్ష్యంగా చేసుకోవాలి. ఇందులో ఐటీ, హైడ్రోజన్ ఇంధనం, పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలు ఉన్నాయి. రుణం మొత్తం ప్రాజెక్ట్ మొత్తంలో గరిష్ఠంగా 80%కి లోబడి, ‘ARISE’ చొరవ కింద రూ.7 కోట్ల వరకు లోన్ మంజూరు అవుతుంది. ఈ లోన్ వడ్డీ రేటు ఫ్లోటింగ్ ప్రాతిపధికన ఉంటుంది. రిజర్వు బ్యాంక్ నిర్ణయించే రెపో రేటుకు అధనంగా 1.50 శాతం నుంచి 2.80 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. లోన్ కాలపరిమితి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. మారటోరియం రెండు సంవత్సరాలుగా ఉంటుందని SIDBI నిర్ణయించింది.