Credit Card: ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం చాలా పెరిగిపోతోంది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ వల్ల డిజిటల్ క్యాష్ పేమెంట్స్ పెరిగింది. ఇళ్లల్లో ఉండి అవసరమైన సరుకులు కొనుగోలు చేయడం లాంటి పనుల నుంచి కోసం క్రెడిట్ కార్డులు, వ్యాలెట్‌లు ఎక్కువగా వాడుతున్నారు. తొలి రోజుల్లో క్రెడిట్ కార్డులు అంటే బ్యాంకులు మాత్రమే ఇచ్చేవి. దీని కోసం పెద్ద ప్రాసెసే ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అంతా సులభంగా జరిగిపోతుంది. కార్డు పార్సిల్‌లో ఇంటికొచ్చేస్తోంది. అలాంటి సర్వీసుల్లో స్లైస్ ఒకటి. ఇది మామూలు క్రెడిట్ కార్డులకు సమానంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం, క్రెడిట్ కార్డు కంటే ఎక్కువ ఫీచర్లతో ఇది కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది.
అయితే ఈ క్రెడిట్ కార్డు కావాలంటే… స్లైస్ యాప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ సూచించిన ప్రకారం అవసరమైన వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు లాంటి ఇతర సమాచారం అందివ్వాలి. తర్వాత నిర్దేశిత పేజీలో సెల్ఫీ దిగితే.. మొత్తం మీ పాన్ కార్డు వివరాలను బట్టి మీకు క్రెడిట్ లిమిట్ కేటాయిస్తారు. అలా వచ్చిన లిమిట్ అమౌంట్‌తో సాధారణ క్రెడిట్ కార్డు తరహాలోనే స్లైస్ క్రెడిట్ కార్డును వాడుకోవచ్చు. అయితే ఇందులో వచ్చే క్యాష్ బ్యాక్ మిగలిన కార్డులతో పోలిస్తే వేగంగా వస్తాయని సంస్థ చెబుతోంది.
ప్రస్తుతం స్లైస్ కార్డు వినియోగదారులకు అందుబాటులో క్యాష్ బ్యాక్, ఆఫర్లు ఉన్నాయి. లింక్డ్‌ఇన్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ (₹800 కంటే ఎక్కువ) ఈ కార్డుతో తీసుకుంటే దానిపై ₹100 క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఐఆర్‌సీటీసీ యాప్‌లో చేసే ₹500కుపైబడిన కొనుగోళ్లపై ఫ్లాట్ ₹75ల ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఫోన్‌పేలో స్లైస్ కార్డులో చేసే కొనుగోళ్లపై ₹50 క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అయితే కనీసం ₹400 కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లోనూ ₹250 క్యాష్ బ్యాక్ ఉంది. అయితే ఇది ₹1500 అంతకంటే ఎక్కువ కొనుగోళ్లకే వర్తిస్తుంది. ఇలా ఈ క్రెడిట్ కార్డుపై ఎన్నో ఆఫర్లను అందిస్తున్నారు.