
బంగారం ధరలకు భిన్నంగా వెండి కొనసాగుతోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతుండగా.. వెండి ధరలు మాత్రమే స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా సిల్వర్ కూడా పెద్దగా మార్పుల్లేవ్. అమెరికన్ డాలర్ గత కొద్ది రోజులుగా నెమ్మదిగా బలహీనపడుతోంది. దీంతో పాటు యూఎస్ బాండ్ల రాబడులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తుండగా.. వెండికి ఆకర్షణ తగ్గింది. గురువారం ఉదయం మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సెప్టెంబర్ సిల్వర్ కాంట్రాక్టులు 1.29 శాతం పెరిగి కిలోకు రూ.2,39,850కి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో దేశీయంగా కూడా దాని ప్రభావం కనిపించింది. దేశీయ ప్యూచర్ మార్కెట్లో కూడా సిల్వర్ ధరలు ఒకేసారి గురువారం రూ.10 వేల మేర పెరిగాయి.
అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్రవ్య మద్దతు ప్రకటన తర్వాత డాలర్ విలువ దిగజారడం, ప్రభుత్వం బాండ్ల దిగుబడులు తగ్గాయి. దీర్ఘకాలిక నోట్లు, బాండ్ల కోసం ద్రవ్య మద్దతు బైబ్యాక్ కార్యకలాపాల పరిమాణాన్ని రెట్టింపు చేయనున్నట్లు యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. దీని ప్రభావంతో రెండు నెలల్లోనే యూఎస్‌లో బంగారం ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. బుధవారం డాలర్ 0.83 శాతం క్షీణించగా.. 10 ఏళ్ల బాండ్ల రాబడులు 1.13 శాతం పడిపోయాయి. ఇక దీంతో పాటు ఆగస్ట్ 19న విడుదలైన యూఎస్ ఫడ్ రిజర్వ్ బ్యాంకు పాలసీ మీటింగ్ మినిట్స్.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళనను వ్యక్తం చేశాయి. వడ్డీ రేట్ల పెంపు అవసరం అవుతుందని ఫెడ్ అంచనా వేసింది. తదుపరి మీటింగ్ సెప్టెంబర్ 15,16వ తేదీల్లో జరగనుండగా.. ఫెడ్ నిర్ణయాలు వెండి ధరలపై ప్రభావితం చూపనున్నాయి.
గత 10 రోజుల్లో వెండి ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. ఆగస్ట్ 11న కిలో వెండి రూ.2.60 లక్షల వద్ద ప్రారంభమవ్వగా.. ఆగస్ట్ 13 వరకు అవే ధరలు కొనసాగాయి. ఇక ఆగస్ట్ 15న రూ.5 వేలు తగ్గి రూ.2.55 లక్షలకు చేరుకోగా.. ఆగస్ట్ 18 వరకు అదే ధర కొనసాగించింది. ఆగస్ట్ 19న రూ.5 వేలు తగ్గి రూ.2.50 లక్షలకు చేరుకోగా.. ఆగస్ట్ 22వ తేదీన ఒకేసారి రూ.10 వేలు పెరిగి రూ.2.60 లక్షలకు చేరుకుంది. ధరలు అటుఇటుగా ఒకేచోట కొనసాగుతున్నాయి. కానీ బంగారం ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గత నెలలో తులం బంగారం ఒక దశలో రూ.1.50 వేల దిగువకు కూడా చేరుకోగా.. ఆగస్ట్ 20 నాటికి రూ.1.60 లక్షలకు పెరిగింది. ఒక్క నెలలోనే బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాబోయే రోజుల్లో బంగారంతో పాటు వెండి ధరలు ఎలా ఉంటాయనేది చూడాలి.