Latest Silver Price: పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో (Bullion Market) బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఇటీవల (Silver Price) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కూడా వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ. 62,700 గా ఉంది. కిలో వెండిపై రూ.140 మేర పెరిగింది. కాగా.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,700 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 62,700 లుగా కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 66,800 లుగా ఉంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 62,700 లుగా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 66,800 గా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.66,800 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,800 గా ఉంది.
* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 66,800 లుగా ఉంది.
* విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 66,800 వద్ద కొనసాగుతోంది. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: