Silver Price Today: ఒక వైపు బంగారం పెరుగుతుంటే.. మరోవైపు వెండి తగ్గుతోంది. నిన్న ఉదయం కిలో వెండి ధరపై రూ.370 వరకు దిగి రాగా, తాజాగా శనివారం కిలో వెండి ధరపై రూ.700 మేర తగ్గుముఖం పట్టింది. ఈ రోజు బంగారం ధర స్వల్పంగా పెరుగుతుంటే వెండి మాత్రం దిగి వచ్చింది. అయితే బంగారు, వెండి కొనుగోళ్లలో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలో లాక్‌డౌన్‌లో ఉండటంతో పసిడి కొనుగోళ్లు పెద్దగా జరగడం లేదు. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, చెన్నైలో రూ.75,300 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, కోల్‌కతాలో రూ.70,500 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, కేరళలో రూ.70,500 ఉంది. ఇక తెలంగాణలోని హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,300 ఉండగా, ఏపీలోని విజయవాడలో కిలో వెండి ధర రూ.75,300 వద్ద ఉంది.