Silver Price Today: తాజాగా పెరిగిన వెండి ధర… ఏప్రిల్‌లో రూ.5,900 పెరిగిన సిల్వర్‌.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

|

Apr 16, 2021 | 6:17 AM

Silver Rate Today: ప్రతి రోజు బంగారం ధరల లాగే వెండి ధరల్లో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు వెండి ధరలు తగ్గుతుంటే..మరో రోజు దూసుకుపోతోంది...

Silver Price Today: తాజాగా పెరిగిన వెండి ధర... ఏప్రిల్‌లో రూ.5,900 పెరిగిన సిల్వర్‌.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
Silver Price
Follow us on

Silver Rate Today: ప్రతి రోజు బంగారం ధరల లాగే వెండి ధరల్లో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు వెండి ధరలు తగ్గుతుంటే..మరో రోజు దూసుకుపోతోంది. కొన్ని సందర్భాలలో బంగారం కంటే వేగంగా దూసుకుపోయిన రోజులున్నాయి. అయితే గురువారం మాత్రం కిలో వెండి ధరపై 1300 వరకు పెరుగగా, తాజాగా శుక్రవారం రూ.200 పెరిగింది. అయితే ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు వెండి ధరలు పరిశీలిస్తే పెరుగుదలనే ఉంది. గత 15 రోజుల్లో వెండి ధర కిలోకు రూ.5,900 వరకు పెరిగింది. 6 నెలల కిందట కిలో వెండి ధర రూ.62,000 ఉండగా, ఇప్పుడు రూ.71,900 ఉంది.  మరి కొన్ని ప్రాంతాల్లో రూ.67 వేల వరకు ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,800 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 67,800 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా,. కోల్‌కతాలో రూ.67,800 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, కేరళలో రూ.67,800 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, విజయవాడలో రూ.71,900 ఉంది. అలాగే విశాఖలో కిలో వెండి రూ.71,900 ఉంది. అయితే ఇతర రాష్ట్రాల్లో వెండి ధరల్లో మార్పులు ఉండగా, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒకేలా ఉంటున్నాయి.

ఇవీ చదవండి: Gold Price Today: ఈ నెలలో రూ.2,940 పెరిగిన బంగారం ధర.. తాజాగా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

ATM Cash Withdrawal: కార్డు అవసరం లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు… ఎలాగంటే..!