Silver Price Today: పసిడి ధర పెరిగితే వెండి తగ్గుతోంది.. దిగి వస్తున్న సిల్వర్‌ ధరలు.. తాజాగా ఏ నగరంలో ఎంత..!

|

Aug 21, 2021 | 6:22 AM

Silver Price Today: వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక వైపు బంగారం ధరలు పరుగులు పెడుతుంటే వెండి..

Silver Price Today: పసిడి ధర పెరిగితే వెండి తగ్గుతోంది.. దిగి వస్తున్న సిల్వర్‌ ధరలు.. తాజాగా ఏ నగరంలో ఎంత..!
Follow us on

Silver Price Today: వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక వైపు బంగారం ధరలు పరుగులు పెడుతుంటే వెండి ధరలకు మాత్రం బ్రేకులు పడ్డాయి. క్రమ క్రమంగా సిల్వర్‌ దిగి వస్తోంది. నిన్న బంగారం తగ్గుముఖం పడుతుంటే.. వెండి ధరలు తగ్గాయి. ఇక ఈ రోజు కూడా వెండి ధరలు దిగి వచ్చాయి. తాజాగా శనివారం (ఆగస్టు 21)న దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. భారతీయ సాంప్రదాయంలో బంగారం లాగే వెండి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశీయంగా కిలో రూ.70 వేలకుపైగా ఉన్న వెండి ధర రోజురోజుకు దిగివస్తోంది. ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.62,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, కోల్‌కతాలో రూ.62,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.62,200 ఉండగా, కేరళలో రూ.67,000 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.62,200 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, విశాఖపట్నంలో రూ.67,000 ఉంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిది.

కాగా, బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: వినియోగదారులకు షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి..!

LPG Gas Cylinder Price: పేదల నడ్డి విరుస్తున్న గ్యాస్‌ సిలిండర్ ధరలు.. ఒక సంవత్సరంలో ఎంత పెరిగిందంటే..

Gold Fixed Deposit Scheme: మీ ఇంట్లో బంగారం ఉందా..? ఈ స్కీమ్‌లో పెడితే వడ్డీ పొందవచ్చు..!