Silver Price Today: స్థిరంగానే వెండి ధరలు.. ప్రధాన నరగాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Sep 20, 2021 | 6:51 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి

Silver Price Today: స్థిరంగానే వెండి ధరలు.. ప్రధాన నరగాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price Today
Follow us on

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో రెండు రోజుల నుంచి రేట్లు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. సోమవారం వెండి ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.60,600లుగా ఉంది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,000 లుగా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 64,200లుగా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.60,000 గా కొనసాగుతోంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.60,000 లుగా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.64,200గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,200 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలో వెండి ధర రూ. 64,200 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.64,200 లుగా ఉంది.

కాగా.. ఈ ధరలు సోమవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. స్థిరంగానే బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Bhishma Niti: ఉన్నత పదవులను దుర్మార్గులకు ఇస్తే ఏ విధమైన పరిమాణాలు ఏర్పడతాయో భీష్ముడు చెప్పిన కథ