Silver rate Today: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నా.. బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతున్నాయి. ప్రపంచంలో అదేవిధంగా దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా.. బుధవారం కూడా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండికి 400 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 71,500 రూపాయలు ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,500 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 71,500 గా ఉంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.71,500 వద్ద కొనసాగుతోంది.
కోల్కతాలో కిలో వెండి ధర రూ.71,500 వద్ద ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.75,900 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్లో వెండి కిలో రూ.75,900 లు ఉంది.
విజయవాడలో వెండి రూ.75,900లు వద్ద కొనసాగుతోంది.
కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లోనే వెండి ధరలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,630 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,630 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,630 వద్ద కొనసాగుతోంది.
Also Read: