Silver Cost Today(05-02-2021): కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని చేసిన ప్రతిపాదనలతో… పసిడి, వెండి రేట్లు దేశీయ మార్కెట్ లో ధరలు దిగివస్తున్నాయి. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది.వరసగా వెండి ధర దిగి వచ్చింది. నిన్నటి నుంచి ఈరోజు కి పోలిస్తే ఏకంగా కిలో వెండి రూ.1000 దిగొచ్చింది.
గ్లోబల్ మార్కెట్ లో ధరలతో పనిలేకుండా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణం బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తానని అనడమే అని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తో పాటు వెండి రేటు కూడా పయనించింది. కేజీ వెండి ధర రూ.1,000 దిగివచ్చి తాజాగా రూ.72,200లకు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
Also Read: