Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. కొనేవారికి..

|

Feb 03, 2023 | 2:08 PM

పసిడి రేటు పరుగులు పెడుతోంది. ఉసేన్‌ బోల్ట్‌ను మించిన వేగంతో రన్‌ రాజా రన్‌ అంటోంది. ఆల్‌ టైమ్‌ హై రేట్లతో రికార్డులు బద్దలు కొట్టుకుంటూ పరిగెడుతోంది. 10 గ్రాముల బంగారం రేటు దాదాపు..

Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. కొనేవారికి..
Gold Price
Follow us on

బంగారానికి భారతీయులిచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దాని ధర ఎంత పెరుగుతోందో దానిపై ఆసక్తి అంతగా పెరిగిపోతుంది. ధర పెరిగితే డిమాండ్‌ తగ్గాలన్న ఆర్థిక సూత్రానికి విరుద్ధం బంగారం. కాని, ఈసారి పండగ సీజన్‌లో బంగారం కొంత కళతప్పింది. ధర ఆకాశాన్ని అంటడంతో రిటెయిల్‌ అమ్మకాలు తగ్గాయి. చాలా మంది కొనుగోలుదారులు నగల కొనుగోలును వాయిదా వేస్తున్నారు లేదంటే తక్కువ మొత్తంలో కొంటున్నారు. ఒకరోజు క్రితం విపరీతమైన పెరుగుదల నమోదు చేసిన బంగారం, వెండి శుక్రవారం భారీ క్షీణతను నమోదు చేసింది. గురువారం నాటి స్పీడ్ చూస్తుంటే బంగారం 60 వేల స్థాయికి చేరుకుంటుందని ఒక్కసారిగా అనిపించింది. కానీ ఇవాళ మళ్లీ 10 గ్రాములు రూ.58,000 స్థాయికి దిగజారింది. శుక్రవారం, మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం, వెండి పెరుగుదల నమోదైంది, అయితే అది బులియన్ మార్కెట్‌లో పడిపోయింది.

బంగారం, వెండి మరింత పెరిగే అవకాశం..

శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం రూ. 157 లాభంతో రూ. 57852 వద్ద ట్రేడవుతోంది. వెండిలో హెచ్చు తగ్గులు కూడా కొనసాగాయి. ఈ సమయంలోనే కిలో రూ.70557 స్థాయిలో కనిపించింది. అంతకుముందు బుధవారం నాటి సెషన్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధర రూ.57695, వెండి రూ.70204 వద్ద ముగిసింది. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బులియన్ మార్కెట్..

ఇక పరిస్థితి శుక్రవారం సెషన్‌లో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలలో క్షీణత కనిపించింది. ఇండియా బులియన్స్ అసోసియేషన్ శుక్రవారం ఉదయం విడుదల చేసిన ధర ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58013కి పడిపోయింది. వెండి కిలో రూ.69745 వద్ద కనిపించింది. అదేవిధంగా 23 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.57781కి, 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.53139, 18 క్యారెట్ల 10 గ్రాములు రూ.43509కి చేరింది. అంతకుముందు గురువారం బంగారం ధర 10 గ్రాములకు రూ.58882 వద్ద ముగిసింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం