Stock Market: బుల్‌ జోరు.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 1,047, నిఫ్టీ 311 పాయింట్లు అప్..

|

Mar 17, 2022 | 4:04 PM

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్ల్ భారీ లాభాల్లో ముగిశాయి. US ఫెడరల్ రిజర్వ్ 2018 తర్వాత మొదటిసారిగా పాలసీ రేటును పెంచడం, రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చల పురోగతితో..

Stock Market: బుల్‌ జోరు.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 1,047, నిఫ్టీ 311 పాయింట్లు అప్..
stock Market
Follow us on

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్ల్ భారీ లాభాల్లో ముగిశాయి. US ఫెడరల్ రిజర్వ్ 2018 తర్వాత మొదటిసారిగా పాలసీ రేటును పెంచడం, రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చల పురోగతితో గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,047 పాయింట్లు పెరిగి 57,863 వద్దకు చేరుకోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 311 పాయింట్లు పెరిగి 17,287కి చేరుకుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.36 శాతం, స్మాల్ క్యాప్ షేర్లు 1.02 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.03, నిఫ్టీ బ్యాంక్ వరుసగా 1.95 శాతం పెరగాయి.

హెచ్‌డీఎఫ్‌సీ 2.75 శాతం పెరిగి రూ. 2,355.10 చేరుకుని నిఫ్టీలో టాప్ గెయినర్‌గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 510 కంపెనీల షేర్లు క్షీణించగా, 2,101 కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లాభపడ్డాయి. అటు క్రూడ్ ఆయిల ధర కూడా తగ్గడం మార్కెట్‌కు సానుకూలంగా మారింది. క్రూడ్ ఆయిల్‌ బ్రెంట్ బ్యారేల్ 97.96 డాలర్లు ఉండగా.. డబ్ల్యూటీఐ బ్యారేల్ 95.04 డాలర్లుగా ఉంది.

Read Also..  Tata UPI Payments: టాటా నుంచి యూపీఐ పేమెంట్ యాప్‌.. ఎన్‌పీసీఐ క్లియరెన్స్ కోరుతూ దరఖాస్తు..!