Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 1,534 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌..

|

May 20, 2022 | 4:03 PM

గత సెషన్‌లో తీవ్రంగా నష్టపోయిన స్టాక్‌ మారెట్లు(Stock Market) శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 1,534 పాయింట్లు పెరిగి 54,326 వద్ద ముగిసింది...

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 1,534 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌..
stock market
Follow us on

గత సెషన్‌లో తీవ్రంగా నష్టపోయిన స్టాక్‌ మారెట్లు(Stock Market) శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 1,534 పాయింట్లు పెరిగి 54,326 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ(NSE) నిఫ్టీ 456 పాయింట్లు పెరిగి 16,266 వద్ద స్థిరపడింది. నేటి సెషన్‌లో డా.రెడ్డీ లాబోరెటరీస్, రిలయన్స్, JSW స్టీల్, నెస్లే ఇండియా, టాటా మోటర్స్‌ లాభాల్లో స్థిరపడగా.. శ్రీసిమెట్, యూపీఎల్‌ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 2.20 శాతం, స్మాల్ క్యాప్ 2.51 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మెటల్ 4.20, నిఫ్టీ ఫార్మా 3.69 శాతం పెరిగాయి. 30 షేర్ల బిఎస్‌ఈ ఇండెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్, ఆర్‌ఐఎల్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు ఈరోజు 1.72 శాతం పడిపోయి రూ. 826.25 వద్ద ముగిసింది. ఎల్‌ఐసి మంగళవారం ఎక్స్ఛేంజీలలో అరంగేట్రం చేసింది. దాని ఇష్యూ ధర రూ. 949 కంటే 8.62 శాతం తగ్గింపుతో లిస్టయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…