గ్లోబల్ మార్కెట్ల బలహీనంగా ఉండడంతో గురువారం స్టాక్ మార్కెట్లు(Stock Market) నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 10.30గంటలకు సెన్సెక్స్(Sensex) ప్రారంభ ట్రేడ్‌లో 467 పాయింట్లు క్షీణించి 59,142 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ(Nifty) 126 పాయింట్లు తగ్గి 17,681 వద్ద సాగుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.25 పైగా స్మాల్ క్యాప్ షేర్లు 0.57 శాతం పెరగుదలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.71 శాతం, నిఫ్టీ ఐటీ 0.79 శాతం వరకు పడిపోయాయి. గురువారం కూడా హెచ్‌డీఎఫ్‌సీ 2 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.52 శాతం పడిపోయాయి. యూపీఎల్, విప్రో, టైటాన్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
సోమవారం మెగా-విలీన ప్రకటన తర్వాత HDFC కవలలు ఒక్కొక్కటి 10 శాతం పెరిగాయి. ఆ తర్వాత రెండు స్టాక్‌లు క్షీణించాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, టైటాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టి, మారుతీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. డాక్టర్ రెడ్డీస్, NTPC, సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముడి చమురు బ్యారెల్‌కు 1.44 డాలర్లు పెరిగి 102.5 వద్ద ట్రేడవుతోంది. డబ్ల్యూటీఐ 1.19 పెరిగి 97.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Also.. Free Charging: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రిలయన్స్.. ఉచితంగా EV ఛార్జింగ్ చేసుకోవచ్చని ప్రకటన..