Stock Market: మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

|

Feb 24, 2022 | 10:37 AM

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం(Russia, Ukraine War) కారణంగా స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా పతమయ్యాయి...

Stock Market: మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Stock Market
Follow us on

ఉక్రెయిన్‌లో రష్యా(Russia, Ukraine War) సైనిక చర్యను చేపట్టిన తర్వాత పెట్టుబడిదారులు జాగ్రత్తగా మారడంతో గురువారం భారతీయ ఈక్విటీ(Stock Market) సూచీలు భారీగా పతనమయ్యాయి. “నేను సైనిక చర్య నిర్ణయం తీసుకున్నాను” అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(puthin) అన్నారు. ఉదయం 9:19 గంటల నాటికి, బెంచ్‌మార్క్ BSE సెన్సెక్స్ 17,00 పాయింట్లు తగ్గి 55,552 వద్దకు చేరుకుంది. విస్తృత NSE నిఫ్టీ502 పాయింట్లు క్షీణించి 16,551 వద్దకు చేరుకుంది. జపాన్ నిక్కీ 2.17 శాతం, దక్షిణ కొరియా కోస్పి 2.66 శాతం, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.89 శాతం క్షీణించడంతో ఆసియా షేర్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి. అలాగే, ఉక్రెయిన్ సంక్షోభం మధ్య 2014 తర్వాత మొదటిసారి బ్రెంట్ చమురు బ్యారెల్ $100కి పెరిగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 2.65 శాతం దిగువకు, స్మాల్ క్యాప్ షేర్లు 3.06 శాతం పడిపోయాయి.

నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్ మరియు నిఫ్టీ ఆటో వరుసగా 3.20 శాతం, 2.71 శాతం తగ్గడం ద్వారా ఇండెక్స్‌ను బలహీనపరిచాయి. స్టాక్-స్పెసిఫిక్ ఫ్రంట్‌లో, అదానీ పోర్ట్స్ నిఫ్టీ లూజర్‌లో అగ్రస్థానంలో ఉంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, UPL, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నష్టల్లో కొనసాగుతున్నాయి. నెస్లే మాత్రమే స్వల్ప లాభాలతో ఉంది.

BSEలో, 270 షేర్లు పురోగమించగా, 2,378 క్షీణించాయి. 30-షేర్ల బిఎస్‌ఇ ప్లాట్‌ఫామ్‌లో, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ మరియు ఎస్‌బిఐ తమ షేర్లు 3.96 శాతం వరకు పడిపోయి అత్యధిక నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ బుధవారం 69 పాయింట్లు లేదా 0.12 శాతం పడిపోయి 57,232 వద్ద ముగిసింది; నిఫ్టీ 29 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 17,063 వద్ద ముగిసింది.

Read Also.. Petrol Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంతంటే..