దేశీయ స్టాక్‌మార్కెట్(Stock Market) సూచీలు గురువారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుతం సెన్సెక్(Sensex) 960 పాయింట్లు నష్టపోయి 53,103 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ(Nifty) 305 పాయింట్ల కోల్పోయి 15,861 వద్ద ట్రేడవుతుంది. మంగళూరు రిఫైనరీ, ఓరియంట్ సిమెంట్(Oriont cement), కేఆర్‌బీఎల్(KRBL), కల్పతరు పవర్, జీహెచ్‌సీఎల్ షేర్లు లాభపడగా.. రిలాక్సో ఫుట్‌వేర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB), ఎల్గీ ఎక్విప్‌మెంట్స్, ప్రిసమ్ జాన్సన్ షేర్లు భారీగా కుంగాయి. ఇక రంగాల వారీగా స్థిరాస్తి సూచీ ఒక్కటే లాభాల్లో కొనసాగుతోంది. మిగిలిన సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా టెలికం సూచీ 1శాతం పతనమైంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్ సూచీలైన డోజోన్స్ 1.2శాతం, ఎస్‌అండ్‌పీ 500 1.65శాతం, నాస్‌డాక్ 3.18శాతం పతనమయ్యాయి.
ఆ ప్రభావం భారత్ మార్కెట్లపై కూడా ప్రతికూలంగా పడింది. నేటి ఉదయం ఆసియా మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. హాంగ్‌సెంగ్, నిక్కీ సూచీలు 1.1శాతం పడిపోయాయి. స్ట్రెయిటైమ్స్, కేవోఎస్‌పీఐ సూచీలు 0.5శాతం పతనం అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర 5శాతం, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 6శాతం చొప్పున పెరిగాయి. గత నాలుగు రోజుల్లో BSE-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 13.32 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. అటు రూపాయి విలువ కూడూ పడిపోతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 14 పైసలు పడిపోయి 77.55గా కొనసాగుతోంది.
Read also.. HUL: వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు బ్రిడ్జ్ ప్యాక్ విధానాన్ని అమలు చేయనున్న హెచ్‌యూఎల్..