స్టాక్ మార్కెట్లు(Stock Market) గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 1,416 పాయింట్లు క్షీణించి 52,792 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ(Nifty) 431 పాయింట్లు తగ్గి 15,809 వద్ద స్థిరపడింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో దేశీయ సూచీలు కుప్పకూలాయి. అమెరికా స్టాక్ మార్కెట్ నష్టంతో ముగియగా.. ఆసియా స్టాక్‌లలో బలహీనమైన ధోరణి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 2.99 శాతం, స్మాల్ క్యాప్ 2.68 శాతం క్షీణించాయి.
నిఫ్టీ IT 5.74, నిఫ్టీ మెటల్ 4.08 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీలో హెచ్‌సిఎల్ టెక్ టాప్ లూజర్‌గా నిలిచింది. ఈ స్టాక్ 5.80 శాతం పడిపోయి రూ.1,011 వద్ద స్థిరపడింది. విప్రో, ఇన్ఫోసిస్, టిసిఎస్, టెక్ మహీంద్రా కూడా నష్టపోయాయి. టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ లూజర్స్‌లో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..