ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), బ్యాంకింగ్ స్టాక్‌లలో భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా పడిపోయాయి. మార్చి-త్రైమాసికం (2021-22) లాభాల అంచనాలను అందుకోకపోవడంతో ఇన్ఫోసిస్(Infosys), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షోర్లు పడిపోయాయి. ఇవేకాకుండా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వివాదం, పలు దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. టోకు ధరల సూచిక (WPI) ద్రవ్యోల్బణం14.55 శాతానికి పెరడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈరోజు1,17 2 పాయింట్లు పతనమై 57,167 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 302 పాయింట్లు 17,174 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.05 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ 1.25 శాతం పడిపోయాయి.
బీఎస్‌ఈ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజే దాదాపు రూ. 2.51 లక్షల కోట్లు తగ్గి రూ. 269.48 లక్షల కోట్లకు పడిపోయింది. నిఫ్టీ ఐటీ 4.58, నిఫ్టీ బ్యాంక్ 1.96 శాతం పడిపోయాయి. ఇన్ఫోసిస్ టాప్ లూజర్‌గా నిలిచింది.ఈ షేరు 7.22 శాతం పతనమై రూ. 1,622.30 చేరింది. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్, టెక్‌ఎమ్, విప్రో, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ టాప్ లూజర్‌గా ఉన్నాయి. NTPC, టాటా స్టీల్, మారుతీ, టైటాన్, M&M, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ITC లాభాలను ఆర్జించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తుండడంతో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. సోమవారం బ్రెంట్ ఫ్యూచర్స్‌లో బ్యారెల్ ధర 1.3 శాతం పెరిగి 113.20 డాలర్లకు పెరిగింది. మరోవైపు రష్యా చర్యలకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు మరింత కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపాయి.
Read Also.. JIO: కస్టమర్ల కోసం జియో మరో సరికొత్త ప్లాన్.. 6 GB హైస్పీడ్ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్.. ధర ఎంతంటే..