రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌..! పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే! లిస్ట్‌ ఇదే..

దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. నిర్వహణ పనుల కారణంగా అక్టోబర్ 7, 8 తేదీలలో కాజీపేట-డోర్నకల్, విజయవాడ-గుంటూరు, సికింద్రాబాద్-వరంగల్ రూట్లలోని 8 రైళ్లు సేవలను నిలిపివేశాయి. దీంతో ప్రయాణికులకు రైళ్లు ముఖ్యమైన రవాణా మార్గంగా ఉండగా, ఈ రద్దు ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌..! పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే! లిస్ట్‌ ఇదే..
Train

Updated on: Feb 06, 2026 | 6:01 PM

మన దేశంలో ప్రతి రోజు కొన్ని లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. అతి తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే రైళ్లకు మించిన మార్గం లేదు. పేద, మధ్యతరగతి వారికి రైల్వేలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే రద్దీని దృష్టిలో పెట్టుకొని పండగల సీజన్‌లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో రైళ్లను రద్దు కూడా చేస్తుంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. వాటి లిస్ట్‌ ఇలా ఉంది..

  • రైలు నంబర్‌ 67765 కాజీపేట-డోర్నకల్
  • రైలు నంబర్‌ 67766 డోర్నకల్ -విజయవాడ
  • రైలు నంబర్‌ 67768 విజయవాడ – డోర్నకల్
  • రైలు నంబర్‌ 67767 డోర్నకల్ – కాజీపేట
  • రైలు నంబర్‌ 67769 విజయవాడ -గుంటూరు
  • రైలు నంబర్‌ 67770 గుంటూరు – విజయవాడ
  • రైలు నంబర్‌ 67761 సికింద్రాబాద్-వరంగల్
  • రైలు నంబర్‌ 67762 వరంగల్ – సికింద్రాబాద్

నిర్వహణ పనుల కారణంగా ఈ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నెల 7 నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్లు రద్దు అయ్యాయి. ఆ తర్వాత యథా విధిగా నడవనున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us