సంక్రాంతి స్పెషల్‌.. తిరుగుప్రయాణానికి మరిన్ని రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే..!

సంక్రాంతి పండుగ తర్వాత సొంతూళ్ల నుంచి నగరాలకు తిరిగి వెళ్లే ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సంక్రాంతి పండగకు వెళ్లి హ్యాపీగా తిరిగి వచ్చేలా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..

సంక్రాంతి స్పెషల్‌.. తిరుగుప్రయాణానికి మరిన్ని రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే..!
Train

Updated on: Jan 14, 2026 | 4:52 PM

సిటీ నుంచి సంక్రాంతి పండగ కోసం స్వగ్రామానికి వెళ్లడం ఒక పెద్ద టాస్క్‌ అయితే.. మళ్లి తిరిగి రావడం అంతకు మించిన టాస్క్‌. ఎందుకంటే.. ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా, సంతోషంగా గడిపి, సొంతూరిని, స్నేహితులను వదిలి మళ్లి బిజీ లైఫ్‌లోకి వెళ్లాలంటే ఎవరికీ మనసు రాదు. కాళ్లు వెనక్కి లాగుతున్నా చాలా బలవంతంగానే ఉరుకులు పరుగుల జీవితంలోకి వెళ్లిపోతారు. ఒకవైపు ఊరి నుంచి వెళ్లడం మనసుకు బాధగా ఉంటే.. ట్రైన్‌లో టిక్కెట్లు దొరక్క, బస్సులో భారీ ధరలకు ఇంకా చిరాకు వస్తుంది. పైగా సంక్రాంతి ముగిసిన వెంటనే బస్సులు, రైళ్లు కిటకిటలాడతాయి. పండుగ సీజన్‌లో ఉండే ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇప్పటికే పలు రైళ్లు ఏర్పాటు చేసిన ఎస్‌సీఆర్‌ తాజాగా మరికొన్ని రైళ్లను ప్రకటించింది. వాటి వివరాలు, టైమ్‌ టేబుల్‌ ఇలా ఉన్నాయి..

  • 07484 విజయవాడ – గుంతకల్ శుక్రవారం(16.01.2026) రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు చేరుకుంటుంది.
  • 07485 మచిలీపట్నం – ధర్మవరం శుక్రవారం (16.01.2026) సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు చేరుకుంటుంది.
  • 07486 వికారాబాద్ – హెచ్.ఎస్.నాందేడ్ మంగళవారం (20.01.2026) ఉదయం 11:30 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 8:30 గంటలకు చేరుకుంటుంది.
  • 07487 వికారాబాద్ – తిరుపతి సోమవారం (19.01.2026) సాయంత్రం 4:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు చేరుకుంటుంది.

రైలు నంబర్‌ 07484 విజయవాడ – గుంతకల్ స్పెషల్ రైలు గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్
రోడ్, కంబం, నంద్యాల, ధోన్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో స్లీపర్,
జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి.

రైలు నంబర్‌ 07485 మచిలీపట్నం -ధర్మవరం ఈ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు,
నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లె, ములకలచెరువు, కదిరి, ముదిగుబ్బ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి.

రైలు నంబర్‌ 07486 వికారాబాద్ – హెచ్.ఎస్.నాందేడ్ ప్రత్యేక రైలు శంకర్‌పల్లి, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, బోలారం, మేడ్చల్, అకనాపేట్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ధర్మాబాద్, ఉమ్రి, ముద్ఖేడ్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో 2AC, 3AC స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ ఉంటాయి.

రైలు నంబర్‌ 07487 వికారాబాద్ – తిరుపతి ప్రత్యేక రైలు శంకర్‌పల్లి, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో 2AC, 3AC స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ ఉంటాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి