School Holiday: నాలుగు రోజుల పాటు విద్యాసంస్థలు బంద్.. ఉత్తర్వులు జారీ

|

Aug 23, 2024 | 3:54 PM

పాఠశాలలకు సెలవులు ప్రకటించారంటే పిల్లలకు పండగే. సెలవుల్లో ఎంచక్క ఎంజాయ్‌ చేయవచ్చని ఎగిరి గంతెస్తారు. తాజాగా ఈ రాష్ట్రంలో ఏకంగా నాలుగు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు మంజూరు చేశారు. పోలీసు రిక్రూట్‌మెంట్, జన్మాష్టమి పండుగ దృష్ట్యా, పాఠశాలలు, కళాశాలలను నాలుగు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి..

School Holiday: నాలుగు రోజుల పాటు విద్యాసంస్థలు బంద్.. ఉత్తర్వులు జారీ
School Holiday
Follow us on

పాఠశాలలకు సెలవులు ప్రకటించారంటే పిల్లలకు పండగే. సెలవుల్లో ఎంచక్క ఎంజాయ్‌ చేయవచ్చని ఎగిరి గంతెస్తారు. తాజాగా ఈ రాష్ట్రంలో ఏకంగా నాలుగు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు మంజూరు చేశారు. యుపి పోలీసు రిక్రూట్‌మెంట్, జన్మాష్టమి పండుగ దృష్ట్యా, గోరఖ్‌పూర్‌లోని పాఠశాలలు, కళాశాలలను నాలుగు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 23 నుంచి 25 వరకు యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహించాలని గోరఖ్‌పూర్ డీఎం కృష్ణ కరుణేష్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కళాశాలలతో పాటు అన్ని బోర్డుల పాఠశాలలు ఆగస్టు 26 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 23-24 తేదీల్లో పోలీసు రిక్రూట్‌మెంట్, 25న ఆదివారం, ఆగస్టు 26న జన్మాష్టమి పండుగ కారణంగా మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశామని డీఎం కృష్ణ కరుణేష్‌ తెలిపారు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి: Bank Holiday: 24 నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా?

పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రోజున దేశం నలుమూలల నుండి వచ్చే అభ్యర్థుల సౌకర్యార్థం, ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ స్టేషన్ నుండి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఈశాన్య రైల్వే ప్రకటించింది. బల్లియా, వారణాసికి ఇక్కడ నుండి రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఐదు రోజుల్లో 10 షిఫ్టుల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష జరగనుంది. ఒక్కో షిఫ్ట్‌లో 22 వేల మందికి పైగా అభ్యర్థులను హాజరు కానున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థులు వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ప్రత్యేక రైలు నంబర్ 05182 ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ నుండి బల్లియాకు ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Mobile Network: మీ మొబైల్‌లో నెట్‌వర్క్‌ సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి!

రైలు ఝూన్సీ, హండియా ఖాస్, జ్ఞాన్‌పూర్ రోడ్, మధోసింగ్, బనారస్, వారణాసి, వారణాసి సిటీ, ఔధైహార్, ఘాజీపూర్ సిటీ, కరీముద్దీన్‌పూర్ మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు బల్లియాకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 05181 బల్లియా-ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ రైలు బల్లియా నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 10:30 గంటలకు ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ చేరుకుంటుంది. 14 కోచ్‌ల ప్రత్యేక రైలులో 12 సాధారణ తరగతి కోచ్‌లు ఉంటాయి. రైలు నంబర్ 05183 బల్లియా నుండి ఉదయం 4:30 గంటలకు బయలుదేరి 11:30 గంటలకు ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ చేరుకుంటుంది. ఇవే కాకుండా మరెన్నో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Google Search Tips: మీరు ఈ 3 విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే జైలుకే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి