SBI కస్టమర్లకు అలర్ట్.. నేడు, రేపు ఆ సర్వీసులు బంద్.. హెచ్చరిస్తున్న బ్యాంక్..

|

Jul 10, 2021 | 6:55 AM

దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు దేశవ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య అధికమే. అలాగే బ్యాంకు నియమ నిబంధనలకు సంబంధించిన విషయాలను

SBI కస్టమర్లకు అలర్ట్.. నేడు, రేపు ఆ సర్వీసులు బంద్.. హెచ్చరిస్తున్న బ్యాంక్..
Follow us on

దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు దేశవ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య అధికమే. అలాగే బ్యాంకు నియమ నిబంధనలకు సంబంధించిన విషయాలను ఎస్బీఐ ఎప్పటికప్పుడూ తమ కస్టమర్లకు సోషల్ మీడియా ద్వారా తెలియజెస్తున్న సంగతి తెలిసిందే. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుపై వినియోగదారులలో విశ్వాసం అధికమే. అయితే ఈ బ్యాంక్ ఆన్‏లైన్ సేవలు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా వినియోగదారులకు వెల్లడించింది. మెయింటెనెన్స్ కారణంగా సర్వీసులకు అంతరాయం కలుగనుందని ఎస్బీఐ తెలిపింది.

ట్వీట్..

కస్టమర్ల అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ఈరోజు (జూలై 10న) 22.45 గంటల నుంచి జూలై 11న 00.15 గంటల వరకు ఎస్బీఐ ఆన్‏లైన్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ఎస్‏బీఐ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పనిచేయవు. అలాగే ఎస్బీఐ తమ కస్టమర్లను మరో విషయంలో అలర్ట్ చేసింది. కస్టమర్లు ఆన్‏లైన్ అకౌంట్ల పాస్‏వర్డ్‏లను తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. అప్పుడే మోసాల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని… ఈ విషయాన్ని కస్టమర్లు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించింది.

ట్వీట్..

Also Read: Gold and Silver Price Today: దేశీయంగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. పలు నగరాల్లో స్వల్పంగా పెరుగుదల..!

Tokyo Olympics 2021 : ఒలంపిక్స్ ప్రైజ్ మనీ ప్రకటించిన కేజ్రీవాల్..! స్వర్ణం సాధిస్తే రూ.3 కోట్లు.. రజతానికి రూ.2కోట్లు, కాంస్యానికి కోటి..