బ్యాంకింగ్ సెక్టర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వినియోగదారుల కోసం కొన్ని నిబంధనలలో మార్పు చేర్పులు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారుల కోసం ఓ కొత్త నిబంధనలు తీసుకుచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సూచనలను అనుసరించి ఎస్‌బీఐ వెళ్లే ఖాతాదారులు కొత్త లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సిందిగా కోరింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు ట్వీట్‌లో ప్రకటించారు. ఒప్పందంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవాలని కూడా సూచించింది.
ఆర్‌బీఐ ఒక్కో బ్యాంకుకు జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. వాటిలో బ్యాంకు ఖాతాదారులలో కనీసం 50 శాతం మంది కొత్త ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే 30 సెప్టెంబర్ వరకు 75 శాతం, అలాగే 31 డిసెంబర్ వరకు 100 శాతం అగ్రిమెంట్‌పై సంతకాల్సి చేయాల్సి ఉండేలా నిబంధనలు రూపొందించింది ఎస్‌బీఐ. వాటిలో అన్ని కస్టమర్ వివరాలు ఆర్బీఐ పోర్టల్‌లో నమోదు చేసి ఉండాలి. లాకర్ సైజ్, లొకేషన్ ఆధారంగా కస్టమర్లకు ఛార్జీ విధించబడుతుంది. చిన్న, మధ్య తరహా లాకర్లకు రూ.500, పెద్ద లాకర్లకు రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేయనున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి