SBI FD Interest Rates: ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ వడ్డీ రేట్లు పెంపు..! ఎంత పెరిగాయంటే..

|

May 15, 2024 | 3:47 PM

Latest SBI FD Interest Rates: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు ఇవాళ్టి(15 మే 2024) నుంచే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్లు తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

SBI FD Interest Rates: ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ వడ్డీ రేట్లు పెంపు..! ఎంత పెరిగాయంటే..
SBI FD interest rates
Follow us on

SBI FD Interest Rates: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు ఇవాళ్టి(15 మే 2024) నుంచే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్లు తన వెబ్‌సైట్‌లో తెలిపింది. సాధారణ పౌరులు, సీనియర్ సిటిజన్ ఖాతాదారులు పెంచిన ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో లబ్ధి పొందనున్నారు.

రూ.2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై గరిష్ఠంగా 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పెంచింది. సామాన్య ఖాతాదారులకు 46 రోజుల నుంచి 179 రోజుల లోపు ఫిక్సిడ్ డిపాజిట్లపై గతంలో 4.75 శాతంగా ఉన్న వడ్డీని 5.50 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు ఇప్పటి వరకు 5.25 శాతంగా ఉన్న వడ్డీని 5.75 శాతానికి పెంచింది. 180 నుంచి 210 రోజుల పాటు ప్రస్తుతం 5.75 శాతంగా ఉన్న వడ్డీ రేటును 6 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్లకు 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 211 రోజుల నుంచి ఏడాది లోపు ఫిక్సిడ్ డిపాజిట్లపై ఇప్పటి వరకు 6 శాతంగా ఉన్న వడ్డీ రేటును 6.25 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్ల పొదుపు మొత్తంపై వడ్డీ రేటును 6.75 శాతానికి పెంచారు.

అయితే 7 నుంచి 45 రోజుల లోపు ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఎస్బీఐ స్పష్టంచేసింది. అలాగే 1-2 ఏళ్లు, 2-3 ఏళ్లు, 3-5 ఏళ్లు, 5-10 ఏళ్ల లోపు ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను యధాతథంగా కొనసాగించనుంది.

SBIలో రీటైల్ ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇప్పుడు ఇలా..

7 – 45 రోజులు: 3.50%

46 – 179 రోజులు: 5.50%

180 -210 రోజులు: 6.00%

211 – 1 సంవత్సరం లోపు: 6.25%

1 – 2 సంవత్సరాలు: 6.80%

2 – 3 సంవత్సరాలు: 7.00%

3 – 5 సంవత్సరాలు: 6.75%

5 – 10 సంవత్సరాలు: 6.50%

(సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వడ్డీ అదనం)

ఎస్బీఐ ఫిక్సిడ్ డిపాజిట్లపై ప్రస్తుతం అందిస్తున్న వడ్డీ రేట్ల పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి..

ఎస్బీఐలో బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్లపై కూడా వడ్డీ పెంపు..

కాగా బల్క్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచింది. 7 రోజుల నుంచి 45 రోజుల లోపు ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పటి వరకు 5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 5.25 శాతానికి పెంచగా.. సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం వడ్డీ రేటు లభించనుంది. 46 రోజుల నుంచి 179 రోజుల లోపు బల్క్ డిపాజిట్లపై ఇప్పుడు 5.75 శాతంగా ఉన్న వడ్డీ రేటును 6.25 శాతానికి పెంచారు. ఈ కాల వ్యవధి బల్క్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.

ఎస్బీఐలో ప్రస్తుత బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్లపై ప్రస్తుత వడ్డీ రేట్లను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి..