SBI: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు షాక్.. నవంబర్‌ 15 నుంచి కొత్త ఛార్జీలు

|

Oct 21, 2022 | 12:59 PM

పలు రంగాలలో కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగాలలో ప్రతినెల కొత్త కొత్త నిబంధనలు వస్తుంటాయి. ఇక ప్రభుత్వరంగ..

SBI: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు షాక్.. నవంబర్‌ 15 నుంచి కొత్త ఛార్జీలు
Emi Transactions,rent Payments Charges
Follow us on

పలు రంగాలలో కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగాలలో ప్రతినెల కొత్త కొత్త నిబంధనలు వస్తుంటాయి. ఇక ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన క్రెడిట్‌ కార్డు కస్టమర్లకు షాకిచ్చింది. క్రెడిట్‌ కార్డుకు సంబంధించిన రెండు మార్పులను చేసింది. ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్‌ ఫీజును రూ.199 వరకు పెంచనుంది. అలాగే కొత్తగా రెండు చెల్లింపులపై ఛార్జీలను వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు నవంబర్‌15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు బ్యాంకు తెలిపింది. అలాగే తన కస్టమర్లకు మెసేజ్‌లను కూడా పంపుతోంది.

ఛార్జీలు ఎలా వర్తిస్తాయి..?

ఏదైనా వస్తువులను ఆన్‌లైన్‌లో గానీ,ఇతర మార్గాల ద్వారా కొనుగోలు చేసినప్పుడు ఈఎంఐగా మార్చినట్లయితే అందుకు బ్యాంకు కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటుంది. ప్రస్తుతం రూ.99+జీఎస్టీని వసూలు చేస్తోంది. ఇక నవంబర్‌ 15వ తేదీ నుంచి ప్రాసెసింగ్‌ ఫీజు రూ.199+జీఎస్టీని వసూలు చేయనుంది. అంటే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులు ఏదైనా ఈఎంఐని మార్చితే ఈ ఫీజును వసూలు చేస్తుంది. అంతేకాకుండా ఇంటి అద్దె చెల్లింపుల లావాదేవీలపై ఇప్పటి వరకు ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. ఇక నుంచి దానిపై కూడా వసూలు చేయనుంది. రూ.99+జీఎస్టీని వసూలు చేయనుంది. ఈ ఛార్జీలు అన్ని నవంబర్‌ 15 నుంచి చేసేవారికి వర్తించనున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఏదైనా చెల్లింపులు చేయాలంటే థర్డ్‌పార్టీ యాప్స్‌ పేటీఎంతో పాటు ఇతర యాప్స్‌ను ఎంచుకుంటాము. ఈ యాప్స్‌ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లింపులు చేయడానికి ప్రజలను అనుమతిస్తాయి. ఈ థర్డ్-పార్టీ యాప్‌లు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లింపులు చేసినందుకు రుసుమును కూడా వసూలు చేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి