బ్యాంక్ చెక్ బుక్‌ కోసం దరఖాస్తు చేసి విసిగి పోయారా.. అయితే ఎస్‌బీఐ ఖాతాదారులైతే ఇలా చేయండి.

కోవిడ్ వ్యాప్తి నుంచి ఆన్‌లైన్‌లోనే పనులు పూర్తి చేసుకుంటున్నారు బ్యాంక్ వినియోగదారులు. అలా అని అన్ని పనులు ఆన్‌లైన్‌లో పూర్తి చేయడం కుదరదు.

బ్యాంక్ చెక్ బుక్‌ కోసం దరఖాస్తు చేసి విసిగి పోయారా.. అయితే ఎస్‌బీఐ ఖాతాదారులైతే ఇలా చేయండి.
Cheque Book

Updated on: Dec 17, 2021 | 8:09 PM

Apply for New Cheque Book:  కోవిడ్ వ్యాప్తి నుంచి ఆన్‌లైన్‌లోనే పనులు పూర్తి చేసుకుంటున్నారు బ్యాంక్ వినియోగదారులు. అలా అని అన్ని పనులు ఆన్‌లైన్‌లో పూర్తి చేయడం కుదరదు. కొన్ని తప్పకుండా పత్రాలు అవసరం. కానీ మీరు ఏదైనా బ్యాంక్ కస్టమర్ అయితే.. మీరు కొన్ని ముఖ్యమైన సంగతులను అస్సలు మరిచిపోవద్దు. ఇందులో ముఖ్యమంగా.. పాస్ బుక్, చెక్ బుక్ సహా బ్యాంకుకు సంబంధించిన ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మీ వెంట ఉంచుకోవాలి. ఒక వేల మీ వద్ద బ్యాంక్ పాస్‌బుక్,  చెక్ బుక్ గడువు ముగిసినట్లైతే వెంటనే దాని కోసం దరఖాస్తు చేసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే.. మీరు ఆన్‌లైన్ ద్వారా చెక్‌బుక్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పలుమార్లు చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నా చెక్కుబుక్ అందలేదని కొందరు వినియోగదారులు వాపోతున్నారు. బ్యాంక్ అధికారులు మీ రిజిస్టర్డ్ చిరునామాకు చెక్ బుక్‌ను పంపినప్పటికీ.. చెక్ బుక్ అందని పక్షంలో మీరు ఇతర మార్గాల్లో కూడా చెక్ బుక్‌ను పొందవచ్చు.

దరఖాస్తు చేసుకున్నా చెక్కు పుస్తకం అందలేదు

ఇదే విషయాన్ని ఇటీవల ఒక కస్టమర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ట్యాగ్ చేశాడు. ఉత్తరాఖండ్‌కు చెదిన ఓ బీఎస్ఎఫ్ సైనికుడు పలు సార్లు చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ చెక్ బుక్ రాలేదు. దీంతో అసౌకర్యానికి లోనైన అతను బ్యాంక్ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. దీంతో ఎస్బీఐ వెంటనే సమాధానం ఇచ్చింది. 

చెక్ బుక్ డెలివరీ చేయడానికి 7 రోజులు

మీరు చెక్‌బుక్ కోసం దరఖాస్తు చేసి ఎక్కువ సమయం కానట్లయితే.. మీరు వేచి ఉండవచ్చు. ఎందుకంటే డెలివరీ సమయం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు, చెక్‌బుక్ డెలివరీ కావడానికి సాధారణంగా 7 రోజులు పడుతుంది. అటువంటి పరిస్థితిలో, చెక్‌బుక్ 7 రోజులలోపు అందకపోతే మీరు మీ ప్రాంతంలోని పోస్టాఫీసును సంప్రదించాలి. మరోవైపు, మీ చెక్ బుక్ తిరిగి వచ్చినట్లయితే ఆ సందర్భంలో చెక్ బుక్ మీ హోమ్ బ్రాంచ్‌కు వెళుతుంది. మీకు కావాలంటే, మీరు మీ బ్యాంక్ శాఖను సందర్శించడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. బ్రాంచ్ నుండి KYC పత్రాలు, పాస్‌బుక్‌ను సమర్పించిన తర్వాత మీరు దాన్ని పొందుతారు.

బ్యాంకు ఖాతాదారుడికి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్‌పై కస్టమర్‌కు ప్రత్యుత్తరం ఇస్తూ..

మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అని రాసింది. కస్టమర్ తన ఫిర్యాదును ఈ లింక్ ద్వారా సమర్పించవచ్చు 

>> మీ ఫిర్యాదును నమోదు చేయండి

>> ఫిర్యాదు లేదా అభ్యర్థనను సేకరించండి

>> ప్రస్తుత కస్టమర్ (MSME/Agri/ఇతర గ్రీవెన్స్)- జనరల్ బ్యాంకింగ్

>> చెక్‌బుక్ సంబంధిత వివరాలను ఇవ్వగలరు. అదే సమయంలో బ్యాంకు ద్వారా తగిన చర్యలు తీసుకుంటాము. అని వెల్లడించింది. 

ఇవి కూడా చదవండి: మీ ఇంటికి బిర్యానీ ఎవరు తెచ్చారో ఓ సారి చూడండి.. డెలివరీ బాయ్ కాదండోయ్..

Rakesh Jhunjhunwala: 10 సెకెన్లలో రూ. 318 కోట్లు మాయం.. దలాల్ స్ట్రీట్‌లో దగాపడిన బిగ్ బుల్..