SBI: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ లావాదేవీలపై 5 లక్షల వరకు పరిమితి..

|

Jan 04, 2022 | 5:42 PM

SBI: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లను డిజిటల్ బ్యాంకింగ్‌ రంగం వైపు ప్రోత్సహించేందుకు

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ లావాదేవీలపై 5 లక్షల వరకు పరిమితి..
Sbi
Follow us on

SBI: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లను డిజిటల్ బ్యాంకింగ్‌ రంగం వైపు ప్రోత్సహించేందుకు అతిపెద్ద అడుగు వేసింది. డిజిటల్ లావాదేవీలపై జీరో ఛార్జీలతో తక్షణ చెల్లింపు సేవలు కల్పిస్తోంది. IMPS లావాదేవీల పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. YONOతో సహా ఇంటర్నెట్ బ్యాంకింగ్/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా రూ.5 లక్షల వరకు జరిగే IMPS లావాదేవీలపై బ్యాంక్ ఎటువంటి సేవా ఛార్జీని విధించదు.

అయితే కొత్త స్లాబ్‌ను రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు చేర్చారు. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఉన్న మొత్తానికి, IMPS ద్వారా డబ్బు పంపినందుకు ఛార్జ్ రూ. 20 ప్లస్ GST మాత్రమే. IMPSపై సేవా ఛార్జీలు NEFT/RTGS లావాదేవీల సేవా ఛార్జీలతో సమానంగా ఉంటాయి. రూ.1,000 వరకు లావాదేవీ మొత్తానికి IMPS కింద సేవా ఛార్జీ లేదు. రూ.1,001 నుంచి రూ.10,000 రూ.2తో జీఎస్టీ వర్తిస్తుంది. రూ. 10,001 నుంచి రూ.1 లక్ష వరకు జరిగే లావాదేవీలకు రూ. 4తో పాటు జిఎస్‌టి వర్తిస్తుంది. రూ.1 లక్ష కంటే ఎక్కువ మొత్తంలో రూ. 2 లక్షల వరకు రూ. 12 ప్లస్ జిఎస్‌టి వర్తిస్తుంది. ఈ ఛార్జీలు బ్యాంకు శాఖ నుంచి జరిగే లావాదేవీలపై మాత్రమే వర్తిస్తాయి.

IMPS అనేది బ్యాంకులు అందించే ప్రసిద్ధ చెల్లింపు సేవ. ఇది రియల్ టైమ్ ఇంటర్ బ్యాంక్ ఫండ్ బదిలీని అనుమతిస్తుంది. ఇది ఆదివారాలు, సెలవులతో సహా 24 X 7 వరకు అందుబాటులో ఉంటుంది. IMPSని తక్షణ మొబైల్ చెల్లింపు సేవ అంటారు. సరళంగా చెప్పాలంటే, IMPS ద్వారా మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా ఖాతాదారునికి డబ్బు పంపవచ్చు. ఇందులో డబ్బు పంపే సమయానికి ఎలాంటి పరిమితి లేదు. మీరు IMPS ద్వారా ఎప్పుడైనా, 24 గంటలూ వారంలో ఏడు రోజులూ కొన్ని సెకన్లలో డబ్బును బదిలీ చేయవచ్చు. భారతదేశంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఎక్కడికైనా, ఎప్పుడైనా డబ్బు పంపవచ్చు, కానీ డబ్బు పంపే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. వాస్తవానికి, ఆన్‌లైన్ బ్యాంకింగ్ నుంచి డబ్బును బదిలీ చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. అవి IMPS, NEFT, RTGS.

తినే ఆహారంలో ఇది లేకుంటే బట్టతల వచ్చేస్తుంది..! జుట్టు రాలడం అస్సలు ఆగదు..

Telangana Ration: తెలంగాణలో రేషన్‌ పంపిణీపై క్లారిటీ వచ్చేసింది.. ఎప్పటి నుంచి సరఫరా చేయనున్నారంటే..

Acharya Movie : అదరగొడుతున్న ‘ఆచార్య’ సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సానా కష్టం వచ్చిందే పాట..