Sbi Card Enables Rupay
మీకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే.. అదిరిపోయే శుభవార్తను చెప్పింది స్టేట్ బ్యాంక్. ఎస్‌బీఐ కార్డ్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌పీసీఐ) ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని యూపీఐతో రూపే ప్లాట్‌ఫారమ్‌లో లింక్ చేయాలని తెలిపింది. ఆగస్ట్ 10, 2023 నుంచి ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లు రూపే ప్లాట్‌ఫారమ్‌లో జారీ చేయబడిన వారి క్రెడిట్ కార్డ్‌లతో యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు. ఇటీవల ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్ ఎంపిక భీమ్ యాప్‌లో కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మీరు కూడా ఎంచుకోవచ్చు.
ఈ సదుపాయం పరిచయంతో ఇప్పుడు మీరు పొరుగు దుకాణంలో ఇన్‌స్టాల్ చేసిన యూపీఐ QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా రూపే రూపే క్రెడిట్ కార్డ్‌తో చెల్లించగలరు. అయితే, రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా.. మీరు కేవలం వ్యాపారి యూపీఐ QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా లేదా ఆన్‌లైన్ వ్యాపారులకు చెల్లింపులు చేయడం ద్వారా చెల్లించవచ్చు. పీ2పీ వంటి కొన్ని చెల్లింపులు చేయడం మాత్రం సాధ్యం కాదు.
యూపీఐలో రూపే రూపే క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలంటే..
- ప్లే/యాప్ స్టోర్ నుంచి యూపీఐ థర్డ్ పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- యూపీఐ యాప్‌లో మీ మొబైల్ నెంబర్‌ను నమోదు చేయండి. రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయండి.
- విజయవంతంగా మొబైల్ నెంబర్ నమోదు తర్వాత, క్రెడిట్ కార్డును లిక్ చేయండిని ఎంపిక చేసుకోండి.
- క్రెడిట్ కార్డ్ జారీచేసేవారి జాబితా నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవాలి.
- లింక్ చేయడానికి మీ ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోండి.
- ఇప్పుడు క్రెడిట్ కార్డు చివరి 6 అంకెలు, గడువు తేదీని ఎంటర్ చేయండి.
- మీ 6 అంకెల యూపీఐ పిన్‌ని సెట్ చేయండి.
SBI రూపే క్రెడిట్ కార్డ్‌లో UPIతో PoS చెల్లింపు ఎలా చేయాలి..
- మీ యూపీఐ ప్రారంభించబడిన థర్డ్ పార్టీ యాప్‌లో వ్యాపారి యూపీఐ QR కోడ్‌ని స్కాన్ చేయండి
- చెల్లింపు మొత్తాన్ని నమోదు చేయండి
- డ్రాప్‌డౌన్ నుంచి మీ యూపీఐతో లింక్ చేయబడిన ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోండి
- లావాదేవీని ఓకే చేయడానికి 6 అంకెల యూపీఏ పిన్
మీ క్రెడిట్ కార్డ్‌లో UPIని ఉపయోగించి ఇ-కామర్స్ వ్యాపారికి ఎలా చెల్లించాలి
- వ్యాపారి వెబ్‌సైట్/యాప్‌లో చెల్లింపు మోడ్‌గా మీ క్రెడిట్ కార్డ్‌కి లింక్ చేయబడిన UPI-ప్రారంభించబడిన యాప్‌ను ఎంచుకోండి.
- UPI-ప్రారంభించబడిన యాప్‌కి లాగిన్ చేయండి. అందుబాటులో ఉన్న ఖాతాల జాబితా నుంచి రిజిస్టర్డ్ ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోండి.
- మీ 6 అంకెల UPI పిన్‌ని ఉపయోగించి చెల్లింపును నిర్ధారించండి.
- చెల్లింపు నిర్ధారణ ప్రదర్శించబడుతుంది. చెల్లింపు పూర్తయిన తర్వాత మీరు మళ్లీ వ్యాపారి పేజీకి మళ్లించబడతారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం