SBI Offers: కస్టమర్లకు ఎస్‌బీఐ దీపావళి బంపరాఫర్‌.. కారు, పర్సనల్, గోల్డ్‌ లోన్స్‌పై భారీ ఆఫర్లు..

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. దీపావళి కానుకగా కారు, పర్సనల్‌, గోల్డ్‌లోన్స్‌పై తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది...

SBI Offers: కస్టమర్లకు ఎస్‌బీఐ దీపావళి బంపరాఫర్‌.. కారు, పర్సనల్, గోల్డ్‌ లోన్స్‌పై భారీ ఆఫర్లు..
Sbi Loan Offers

Updated on: Oct 25, 2022 | 9:37 PM

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. దీపావళి కానుకగా కారు, పర్సనల్‌, గోల్డ్‌లోన్స్‌పై తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. పండుగ ఆఫర్‌లో భాగంగా తక్కువ ఈఎంఐ, వడ్డీ రేటు తగ్గింపు, ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు వంటి ఆఫర్లను అందించింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ ఆఫర్లను ప్రకటించింది.

కారు లోన్‌లో భాగంగా ప్రతీ లక్ష రూపాయలకు రూ. 1564 నుంచి ఈఎంఐ మొదలవుతుంది. ఇక పర్సనల్‌ లోన్‌ విషయానికొస్తే ప్రతీ లక్ష రూపాయలకు ఈఎమ్‌ఐ రూ. 1880 నుంచి ప్రారంభంకానుంది. గోల్డ్‌లోన్‌ విషయంలోనూ ఎస్‌బీఐ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ తరహా లోన్‌ తీసుకున్న వారు ప్రతీ లక్ష రూపాయలకు రూ. 3,145 మొదలు ఈఎమ్‌ఐ చెల్లించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఖాతాదారులు బ్యాంకుకు కూడా వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే లోన్‌ అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. యోనో యాప్‌, లేదా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రుణాలు పొందొచ్చు. ఇక ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఎలాంటి హిడ్‌ చార్జీలు లేకుండా 8.4 శాతం వడ్డీ రేటుతో రుణాలను అందిస్తోంది. ఇక పర్సనల్‌ లోన్‌ విషయానికొస్తే 10.55 శాతం ప్రారంభ వడ్డీ రేటు, గోల్డ్‌ లోన్స్‌పై 8.15 శాతం వడ్డీ రేటుకు రుణాలు అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..