Telugu News Business SBI annuity deposit scheme, on single deposit you can earn monthly returns, check out details
SBI monthly income scheme: ఇక్కడ పెట్టుబడి పెడితే.. నెలనెలా ఆదాయం.. ఎస్బీఐ నుంచి అధ్బుత పథకం.. వివరాలివి..
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం గురించి చాలా మందికి తెలుసు. చాలా మంది దీనిని విరివిగా వినియోగించుకుంటున్నారు. ఇదే తరహాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో నెలవారీ ఆదాయ పథకాన్ని అందిస్తోంది. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme) పేరుతో ఈ పథకం అందుబాటులో ఉంది.
చాలా మంది స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్ల నుండి డబ్బు కట్ అయ్యిందని సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెట్టారు. అయితే ఇలా డబ్బు కట్ అవ్వడం వెనుక కారణం ఉంది.
రోజురోజుకూ పెరుగుతున్న ఆర్థిక మాంద్యం భయాలు.. కొరవడిన ఉద్యోగ భద్రత, వేల సంఖ్యలో లే ఆఫ్ లు ప్రకటిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజల్లో అనిశ్చితి పెరుగుతోంది. ముఖ్యంగా ఒకే ఆదాయ వనరు ఉన్న కుటుంబాలలో పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంటోంది. ఫలితంగా అందరూ కొంత ఆదాయాన్ని సేవింగ్స్ చేసుకోవడంతో పాటు సురక్షిత పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ ఉద్యోగం అటూ ఇటూ అయినా నెలవారీ ఆదాయ వచ్చే మార్గాల కోసం చాలా మంది అన్వేషిస్తున్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనల్లోనే ఉంటే ఈ కథనం మీ కోసమే. అలాగే ఎలాంటి పెన్షన్ స్కీమ్స్‌లో లేని వృద్ధులకు బ్యాంకులు అందించే కొన్ని పథకాల్లో డబ్బులు దాచుకోవడం ద్వారా ప్రతీ నెలా కొంత పెన్షన్ పొందొచ్చు.
ఎస్బీఐ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్..
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం గురించి చాలా మందికి తెలుసు. చాలా మంది దీనిని విరివిగా వినియోగించుకుంటున్నారు. ఇది జనవరి 2023 నుండి వడ్డీ రేట్లను ఇటీవల సవరించింది. పెట్టుబడిదారులు 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. ఇదే తరహాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో నెలవారీ ఆదాయ పథకాన్ని అందిస్తోంది. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme) పేరుతో ఈ పథకం అందుబాటులో ఉంది.
డిపాజిటర్లు ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేస్తే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ అంటే ఈఎంఐ రూపంలో డబ్బులు డిపాజిటర్ల అకౌంట్లలో ప్రతీ నెలా జమ అవుతాయి. ఇందులో కొంత అసలు, కొంత వడ్డీ కలిపి వస్తుంది.
ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలల( 3, 5, 7, 10 ఏళ్లు) కాలానికి డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా జమ చేయొచ్చు. మంత్లీ యాన్యుటీ కింద కనీసం రూ.1,000 లభిస్తుంది. జమ చేసే మొత్తంపై లభించే ఇది ఆధారపడి ఉంటుంది. కస్టమర్లు ప్రత్యేక సందర్భాల్లో మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతం ఓవర్ డ్రాఫ్ట్ లేదా లోన్ తీసుకోవచ్చు.
యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లు సాధారణ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో సమానంగా ఉంటాయి. ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 6.1 శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఎంచుకునే కాలవ్యవధిని బట్టి వడ్డీ మారుతుంది. డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినప్పుడు ప్రీమెచ్యూర్ క్లోజర్‌కు అనుమతి ఇస్తారు.
కస్టమర్లు ఏ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో అయినా ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో చేరొచ్చు. ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత ఇతర బ్రాంచ్‌లకు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కస్టమర్లకు యూనివర్సల్ పాస్‌బుక్ జారీ చేస్తారు. మైనర్లు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. NRO, NRE కస్టమర్లు ఈ అకౌంట్ ఓపెన్ చేయడం కుదరదు.