SBI: ఎస్‌బీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌ గడువు పొడిగింపు!

|

Aug 16, 2023 | 3:48 PM

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ 400 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలోపై బ్యాంక్ సాధారణ పెట్టుబడిదారులకు 7.10% చొప్పున వడ్డీని చెల్లిస్తోంది. మరోవైపు సీనియర్ సిటిజన్ల గురించి మాట్లాడితే.. వారికి ఈ పథకం కింద 7.60 శాతం వడ్డీని ఇస్తారు. మీరు ప్రయోజనాల గణనను పరిశీలిస్తే 400 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఈ పథకంలో సాధారణ పెట్టుబడిదారుడు ఈ పథకం కింద రూ.1 లక్ష ఎఫ్‌డి చేస్తే అతను వార్షిక ప్రాతిపదికన రూ. 8,017 వడ్డీని పొందవచ్చు. ఇక సీనియర్‌ సిటిజన్లు ఈ కాల వ్యవధిలో 8,600 వడ్డీ అందుకుంటారు..

SBI: ఎస్‌బీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌ గడువు పొడిగింపు!
Sbi
Follow us on

ఫిక్సెడ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) అనేది పెట్టుబడికి మంచి ఆప్షన్‌. చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును బాగానే ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ అమృత్ కలాష్ స్కీమ్‌ను అందుబాటులో తీసుకువచ్చింది. పెట్టుబడిదారులకు 7 శాతానికి పైగా వడ్డీ ఇస్తోంది. అయితే ఇప్పుడు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఈ పథకం స్వాతంత్ర్య దినోత్సవం వరకు అంటే 15 ఆగస్టు 2023 వరకు మాత్రమే చెల్లుబాటు ఉండేది. తాజాగా ఈ పథకం గడువుపు పెంచుతూ నిర్ణయం తీసుకుంది బ్యాంకు. ఈ సంవత్సరం డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్ 12న కస్టమర్ల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇది 400 రోజుల పెట్టుబడితో ఎస్‌బీఐ ప్రత్యేక పథకం. ఇందులో టీడీఎస్‌ తీసివేసిన తర్వాత మీ ఖాతాలో జమ చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లించబడుతుంది.

పెట్టుబడిదారులు 7.6% వరకు వడ్డీ

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ 400 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలోపై బ్యాంక్ సాధారణ పెట్టుబడిదారులకు 7.10% చొప్పున వడ్డీని చెల్లిస్తోంది. మరోవైపు సీనియర్ సిటిజన్ల గురించి మాట్లాడితే.. వారికి ఈ పథకం కింద 7.60 శాతం వడ్డీని ఇస్తారు. మీరు ప్రయోజనాల గణనను పరిశీలిస్తే 400 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఈ పథకంలో సాధారణ పెట్టుబడిదారుడు ఈ పథకం కింద రూ.1 లక్ష ఎఫ్‌డి చేస్తే అతను వార్షిక ప్రాతిపదికన రూ. 8,017 వడ్డీని పొందవచ్చు. ఇక సీనియర్‌ సిటిజన్లు ఈ కాల వ్యవధిలో 8,600 వడ్డీ అందుకుంటారు.

ఈ పథకంలో రుణ సదుపాయం కూడా అందుబాటు..

ఎస్‌బీఐకి చెందిన ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌పై మెచ్యూరిటీ వడ్డీ టీడీఎస్‌ తీసివేసిన తర్వాత కస్టమర్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఆదాయపు పన్ను చట్టం కింద వర్తించే రేటు ప్రకారం.. టీడీఎస్‌ విధించబడుతుంది. అమృత్ కలాష్ యోజనలో ప్రీమెచ్యూర్, లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పెట్టుబడిదారులు అమృత్ కలాష్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ. 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ముందస్తు ఉపసంహరణకు నిబంధన ఉంది. బ్యాంక్ ప్రకారం.. అమృత్ కలాష్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడానికి ప్రత్యేక కోడ్ అవసరం లేదు. ఇందులో మీరు యోనో బ్యాంకింగ్ యాప్‌ని ఉపయోగించవచ్చు. ఇది కాకుండా మీరు శాఖను సందర్శించడం ద్వారా కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

రెపో రేటు పెరుగుదలతో వడ్డీ పెరిగింది

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో అధిక ద్రవ్యోల్బణం కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ వడ్డీ రేట్లను (రెపో రేటు) వరుసగా తొమ్మిది సార్లు ఒకదాని తర్వాత ఒకటి పెంచింది. అప్పటి నుంచి దేశంలోని బ్యాంకులు తమ వినియోగదారులకు సౌకర్యాన్ని కల్పిస్తూనే వారి ఎఫ్‌డీ పథకం వడ్డీ రేట్లను పెంచాయి. కస్టమర్లలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మరింత ఆకర్షణీయంగా ఉండేలా అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను 9 శాతం వరకు పెంచాయి.

ప్రస్తుతానికి సంబంధించి ఎఫ్‌డీలను పొందడంపై వినియోగదారులకు 4 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ ఇవ్వబడుతోంది. అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకుల జాబితాలో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఎస్‌బీఐ అమృత్ కలాష్ పథకం కింద ఖాతాలను ఈ విధంగా తెరవవచ్చు. 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులు వారి ఖాతాను తెరవవచ్చు. ఇందు కోసం ఆధార్ కార్డ్, గుర్తింపు రుజువు, వయస్సు గుర్తింపు రుజువు, ఆదాయ రుజువు, చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇ-మెయిల్ ఐడి అవసరం. మీరు ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా ఖాతాను తెరవవచ్చు. బ్రాంచ్‌కి చేరుకున్న తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. దీని తరువాత కోరిన అన్ని పత్రాల కాపీని జతచేయాలి. కొంత డబ్బు ప్రారంభ పెట్టుబడితో బ్యాంకులో డిపాజిట్ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి