SBI Alert: ఫ్రాడ్ కస్టమర్ కేర్ నెంబర్ల నుంచి జాగ్రత్త.. ఎవరైనా కాల్ చేస్తే ఇలా ఫిర్యాదు చేయండి..

|

Sep 19, 2021 | 12:16 PM

కరోనా సమయంలో డిజిటల్ లావాదేవీలలో భారీ పెరిగాయి. ఆన్‌లైన్ లావాదేవీలు పెరగడంతో డిజిటల్ మోసాల కేసులు కూడా గణనీయంగా ...

SBI Alert: ఫ్రాడ్ కస్టమర్ కేర్ నెంబర్ల నుంచి జాగ్రత్త.. ఎవరైనా కాల్ చేస్తే ఇలా ఫిర్యాదు చేయండి..
Sbi
Follow us on

కరోనా సమయంలో డిజిటల్ లావాదేవీలలో భారీ పెరిగాయి. ఆన్‌లైన్ లావాదేవీలు పెరగడంతో డిజిటల్ మోసాల కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను తమ బాధితులుగా చేసుకోవడానికి వివిధ వ్యూహాలను అవలంబిస్తున్నారు. కస్టమర్లను వారి బారి నుంచి కాపాడేందుకు బ్యాంకులు కూడా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు హెచ్చరిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నకిలీ కస్టమర్ కేర్ నంబర్లకు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది.

SBI ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఇచ్చింది. SBI తన ట్వీట్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. సరైన కస్టమర్ కేర్ నంబర్ కోసం SBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. మీ బ్యాంక్  గోప్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవడం మానుకోండి.

ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ఏదైనా మోసం జరిగితే ఆ విషయాన్ని వెంటనే ఫిర్యాదు బ్యాంక్ తెలిపింది. మీరు report.phising@sbi.co.in లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 155260 కి కాల్ చేయవచ్చు.

ఖాతా ఇలా ఖాళీ అవుతుంది

నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, మోసగాళ్లు మీ నుండి బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకొని, ఆపై మీ బ్యాంక్ ఖాతా నుండి మొత్తం డబ్బును ఉపసంహరించుకుంటారు. ఫోన్‌లో వారు మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, ఖాతా సంఖ్య, డెబిట్ కార్డ్ నంబర్, OTP వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని అడిగి ఆపై ఖాతాను ఖాళీ చేస్తారు. కాబట్టి మీకు కస్టమర్ కేర్ నంబర్ గుర్తు లేనప్పుడు ఆ నంబర్ పొందడానికి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని కోరింది.

ఫిషింగ్ లింక్‌ల పట్ల జాగ్రత్త

ఇంతకు ముందు డిజిటల్ మోసాలు లేదా ఆన్‌లైన్ ఫిషింగ్ గురించి బ్యాంక్ తన ఖాతాదారులను చాలా సార్లు అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. మీ ఇన్‌బాక్స్‌లో అలాంటి లింక్‌లు వస్తే జాగ్రత్తగా ఉండాలని మరోసారి బ్యాంక్ సూచించింది. వాటిపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. అటువంటి లింక్‌లపై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఆన్‌లైన్ మోసగాళ్లు మోసపూరిత వ్యక్తులను సులభంగా ట్రాప్ చేసి వారి పొదుపు ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును వారి ఖాతాకు బదిలీ చేస్తారని తెలుసుకోవాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..