Samsung Galaxy A22: సాంసంగ్‌ నుంచి గెలక్సీ ఏ22 మొబైల్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. విడుదల ఎప్పుడంటే..!

Samsung Galaxy A22: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సాంసంగ్ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. సాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జీ స్మార్ట్‌పోన్ ఆగస్టులో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది..

Samsung Galaxy A22: సాంసంగ్‌ నుంచి గెలక్సీ ఏ22 మొబైల్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. విడుదల ఎప్పుడంటే..!
Samsung Galaxy A22

Edited By:

Updated on: Jul 14, 2021 | 9:26 PM

Samsung Galaxy A22: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సాంసంగ్ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. సాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జీ స్మార్ట్‌పోన్ ఆగస్టులో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో గెలాక్సీ ఏ 22 స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.18,499 వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆవిష్కరించిన ఏ22 డివైజ్‌ను వచ్చే నెలలో దేశంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4G టెక్నాలజీతో పనిచేస్తుంది.

ఏ22 స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్, 5,000 mAh బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, ఇతర ఫీచర్లను సాంసంగ్ తక్కువ ధరలోనే అందించనుంది. గతంలో మాదిరిగా నాలుగు కలర్ ఆప్షన్లలో కాకుండా.. కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఆవిష్కరించిన పోస్టర్‌లో కూడా రెండు కలర్ వేరియంట్ల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. గెలాక్సీ ఏ22 4జీ స్మార్ట్‌ఫోన్‌లో మొత్తం ఐదు కెమెరాలు ఉంటాయి. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (ఓఐఎస్‌), 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ యూనిట్లు.. మొత్తం ఐదు అధునాతన లెన్స్‌ దీన్ని రూపొందించారు.

ఇవీ కూడా చదవండి

RBI: షాకింగ్‌ న్యూస్‌.. ఇక ఆ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ

India Post Payments Bank: పోస్టల్‌ బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌.. ఆగస్టు 1 నుంచి పెరగనున్న చార్జీలు