Safest Cars in India: ప్రయాణించేటప్పుడు భద్రత ఒక పెద్ద సమస్య. అందువల్ల, కారు కొనుగోలు చేసేటప్పుడు, కస్టమర్‌లు తరచుగా కారు భద్రతా లక్షణాల గురించి తనిఖీలు చేస్తుంటారు. ఈ పండుగ సీజన్‌లో మీ ఇంటికి కొత్త కారును తీసుకురావాలని ఆలోచిస్తున్నారా.. అయితే టెస్టింగ్‌లో మంచి రేటింగ్ పాయింట్‌లతోపాటు అత్యతం సురక్షితమైన కార్లు ఏవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు టెన్షన్ లేకుండా హాయిగా ప్రయాణించగల కార్లు ఏవో ఇక్కడ తెలియజేస్తున్నాం.
టాటా పంచ్
టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ ప్రత్యేక మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ భద్రత పరంగా చాలా మెరుగ్గా ఉంది. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. టాటా పంచ్ పిల్లల సేఫ్టీ పరంగా 49 పాయింట్లకుగాను 40.89 పాయింట్లను పొందింది. పరీక్ష సమయంలో డ్రైవర్, ప్రయాణీకుల తల, మెడ, మోకాలు, ఛాతీని బాగా రక్షించడంలోనూ తన ‘పంచ్’ చూపించి అత్యధిక పాయింట్లు సాధించింది. దీంతో టాటా పంచ్ సేఫ్టీ పరంగా అత్యంత సురక్షితమైందిగా గుర్తించారు.
మహీంద్రా XUV300
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా XUV300 కూడా మంచి పాయింట్లు సాధించింది. పెద్దవారి రక్షణ విషయంలో 17 కిగాను 16.42 పాయింట్లు, అలాగే పిల్లల సేఫ్టీ పరంగా 49 పాయింట్లలో 37.44 పాయింట్లు సాధించారు. ఈ మహీంద్రా కారు పెద్దల విషయంలో మంచి రేటింగ్ పాయింట్లను సాధించింది. ఈ కారులో కూర్చున్న వ్యక్తుల తల, మెడ, మోకాళ్లు, ఛాతీ భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ భద్రత విషయంలో చాలా మెరుగైనదిగా నిలిచింది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌లు పొందిన దేశంలో తయారు చేసిన మొదటి కారు ఇదే కావడం విశేషం. పెద్దవారి రక్షణలో ఈ ఎస్‌యూవీ 17 పాయింట్లకుగాను 16.06 పాయింట్లను పొందింది. అలాగే పిల్లల సేఫ్లీ విషయంలో 3 స్టార్ రేటింగ్ వచ్చింది. అలాగే ఈ కారు పిల్లల భద్రతాలో 49 పాయింట్లలో 25 పాయింట్లను పొందింది.
Chanakya Niti: ఇలాంటి డబ్బును ఎప్పుడూ ముట్టుకోకండి.. వినకుండా టచ్ చేస్తే ఇక అంతే..
Mahindra: బొలెరో, స్కార్పియో, జైలో మహీంద్రా ప్రతి వాహనం పేరు చివరలో ఓ ఎందుకు వస్తుందో తెలుసా..