శబరి ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ప్రయాణం మరింత వేగవంతం.. 2గంటలు సమయం ఆదా..

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌పెస్‌గా మర్చుతున్నట్టు పేర్కొంది. రైల్వేశాఖ తాజా నిర్ణయంతో సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య రెండుగంటల ప్రయాణ సమయం తగ్గనుంది. ఈ కొత్త మార్పులు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

శబరి ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ప్రయాణం మరింత వేగవంతం.. 2గంటలు సమయం ఆదా..
Sabari Express

Updated on: Sep 30, 2025 | 11:36 AM

రైల్వే ప్రయాణంపై ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆసక్తి, రద్దీపై రైల్వే శాఖ దృష్టిపెట్టింది. ప్రయాణికులకు మరింత సౌకర్యమౌన ప్రయాణం కాల్పించాలనే ఉద్దేశంతో రైల్వే ప్రయాణాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా దక్షిణ మధ్య రైల్వే మరో నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌పెస్‌గా మర్చుతున్నట్టు పేర్కొంది. రైల్వేశాఖ తాజా నిర్ణయంతో సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య రెండుగంటల ప్రయాణ సమయం తగ్గనుంది. ఈ కొత్త మార్పులు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

ట్రైన్‌తో పాటు రైల్వేశాఖ దాని నెంబర్‌ను కూడా మర్చింది. ఇంతకుముందు 17229/30 నంబర్లతో నడిచిన శబరి ఎక్స్‌ప్రెస్‌ ఇకపై 20629/30 నంబర్లతో సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పేరుతో రాకపోకలు సాగించనుంది. ఈ తాజాగా మార్పుతో రైలు వేగాన్ని పెంచడంతో పాటు, ప్రయాణ వేళల్లో కూడా కీలక మార్పులు చేశారు రైల్వే అధికారులు.

కొత్త టైమింగ్స్ ప్రకారం రైల్వే ప్రయాణ వివరాలు ఇవే..

సికింద్రాబాద్ నుంచి బయల్దేరే వివరాలు

ఈ కొత్త ట్రైన్‌ ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6:25 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. అయితే గతంలో ఇదే ట్రైన్‌ సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు సాయంత్రి 6:05 గంటలకు గమ్యస్థానానికి చేరుకునేది. తాజాగా మారిన టైమింగ్స్, రైలు వేగంతో సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య రెండు గంటల వరకు సమయం ఆదా కానుంది.

తిరువనంతపురం నుంచి బయల్దేరే వివరాలు

మార్పుల తర్వాత ఈ కొత్త సూపర్‌పాస్ట్‌ ట్రైన్ తిరువనంతపురం రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 6:45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు ఉదయం 11 గంటలకే చేరుకుంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే.. ఇక్కడే బయల్దేరే సమయం యథావిధిగా ఉన్నప్పటకీ.. రైలు గమ్యస్థానం చేరుకునే విషయంలో మాత్రం మార్పులు చోటుచేసుకున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఈ రైలు ఉదయం 6.45కి బయల్దేరి మధ్యాహ్నం 12:45 గంటలకు సికింద్రాబాద్ చేరుకునేది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.