Russia Ukraine War: యుద్ధ ప్రభావంతో పెరగనున్న వాటి ధరలు.. నిపుణులు ఏమంటున్నారంటే..

Russia Ukraine Crisis: ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. ఆ ప్రభావం ఇకర దేశాలపై తప్పకు ఉంటుంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత్ కూడా చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది.

Russia Ukraine War: యుద్ధ ప్రభావంతో పెరగనున్న వాటి ధరలు.. నిపుణులు ఏమంటున్నారంటే..
Russia Ukraine War

Updated on: Mar 17, 2022 | 8:25 AM

Russia Ukraine Crisis: ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. ఆ ప్రభావం ఇకర దేశాలపై తప్పకు ఉంటుంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత్ కూడా చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితిపై దీర్ఘకాలంలో ఎటువంటి ప్రభావం ఉండనుందనే దానిపై కేంద్ర ప్రభుత్వం(Union government) అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కారణంగా ప్రధానంగా చమురు, వంటనూనెలు, బంగారం ఎక్కవ ప్రభావితమౌతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పతనం కావటం ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది.

దిగుమతి కష్టాలు..

రష్యా భారత్‌ మైత్రి ఇప్పటిది కాదు. వాణిజ్యంలో కూడా ముఖ్యమైన, నమ్మకమైన భాగస్వామే. రష్యాకు మనదేశం నుంచి మందులు, రసాయనాలు, విద్యుత్‌ పరికరాలు, తేయాకు, దుస్తులు, కొన్ని పెట్రో ఉత్పత్తులు ఎక్కువ శాతం ఎగుమతి అవుతుంటాయి. భారత్ సైతం రష్యా నుంచి బొగ్గు, చమురు, బంగారం, ఆయుధాలు, ఎరువులు, లోహాలు వంటి వాటిని ప్రధానంగా దిగుమతి చేసుకుటోంది. వంట నూనెలు, గోధుమలు విషయంలో మన దేశానికి అవకాశంతో పాటు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా.. ప్రభుత్వ రంగ చమురు సంస్థ రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకు క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకునేందుకు భారత్ డీల్ చేసుకోవటంతో పెద్దన్న అమెరికా తీవ్రంగా తప్పుపడుతోంది. భారత దిగుమతి నిర్ణయం ఆంక్షల పరిధిలోకి రానప్పటికీ అమెరికా మాత్రం భారత్ పై పెంచేదుకు ప్రయత్నిస్తోంది.

పెరగనున్న భద్రత ముప్పు..

ప్రస్తుతం మూడు వారాలుగా ఈ యుద్ధం కొనసాగున్నందున.. భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఈ యుద్ధం మరింత కాలంపాటు కొనసాగితే మనకు ఇబ్బందులు పెరిగే అవకాశం ఎక్కువశాతం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరిగి పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ యుద్ధం మరింత అనిశ్చితిని పెంచుతోంది. రష్యా నుంచి భారత్‌కు ఆయుధ సరఫరాలో ఆటంకాలు నెలకొంటే- పక్కలో బల్లెంలా ఉన్న చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధాన్ని ఎదుర్కొనే సన్నద్ధత శక్తి భారత్ కు తగ్గుతుంది. దీనిని ఈ రెండు దేశాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

ప్రియం కానున్న సెల్ ఫోన్లు, కార్లు..

ఇవీ చదవండి..