రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్(Oil), లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, ఇది నికర ఇంధన దిగుమతిదారులకు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్(Moody’s) బుధవారం తెలిపింది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ టేలర్ మాట్లాడుతూ మధ్య ఆసియాలోని వస్తువుల ఉత్పత్తిదారులు చైనాకు సరఫరాను పెంచే అవకాశాలు ఉన్నప్పటికీ, దిగుమతి మళ్లింపు,0 వైవిధ్యీకరణ వల్ల వాణిజ్య ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. సరఫరా గొలుసు అడ్డంకులు కూడా తీవ్రమవుతాయి. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను జోడిస్తుంది. ఇటీవలి వారాల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సోమవారం మాస్కో తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్రంగా గుర్తించాలని నిర్ణయించుకుంది. అక్కడ రష్యన్ దళాలను మోహరించింది.
రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారు రష్యాపై ఆంక్షల భయాల మధ్య గ్లోబల్ ముడి చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ మంగళవారం బ్యారెల్‌కు $100కి చేరుకుంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85%, సహజ వాయువు అవసరాలలో సగం దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి చేసుకున్న ముడి చమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తుండగా, గ్యాస్‌ను ఆటోమొబైల్స్‌లో సిఎన్‌జిగా, ఫ్యాక్టరీలలో ఇంధనంగా ఉపయోగిస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి ఎల్‌పీజీ, సీఎన్‌జీ ధరలు పెరుగుతాయేమోనన్న భయం నెలకొంది. ప్రతి ఆరు నెలలకోసారి సహజవాయువు దేశీయ ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ధరలలో తదుపరి సవరణ ఏప్రిల్‌లో జరగనుంది. అప్పుడు గ్యాస్ కొరత ప్రభావం ప్రపంచ స్థాయిలో కనిపిస్తుంది. గ్యాస్ ధర పెంపుతో ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ, విద్యుత్ ధరలు కూడా పెరగనున్నాయి.
Read Also.. Maruti Suzuki: మారుతి బాలెనో కొత్త మోడల్ అదుర్స్.. చిప్‌ల సరఫరాతో విక్రయాల్లో మరింత ఊపు: CEO