Business Ideas: ఊర్లో ఉంటూ కాలు మీద కాలేసుకొని బతకొచ్చు! ఈ బిజినెస్‌లో అంత పవర్‌ ఉంది! డబ్బుతో పాటు గౌరవం!

ఊర్లో విజయవంతమైన వ్యాపారం కోసం చూస్తున్నారా? వ్యవసాయ రంగంపై ఆధారపడి, రైతుల అవసరాలు తీర్చే ఎరువులు, పురుగు మందుల షాపు అద్భుత అవకాశం. ఇది తక్కువ పెట్టుబడి తో ప్రారంభించి, రైతులకు సేవ చేస్తూ, సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకునే మార్గం.

Business Ideas: ఊర్లో ఉంటూ కాలు మీద కాలేసుకొని బతకొచ్చు! ఈ బిజినెస్‌లో అంత పవర్‌ ఉంది! డబ్బుతో పాటు గౌరవం!
Gratuity

Updated on: Nov 30, 2025 | 9:30 AM

చాలా మందికిక ఉన్న ఊర్లోనే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ దర్జాగా బతకాలని ఉంటుంది. కానీ, సరైన పెట్టుబడి లేకనో, ఏ వ్యాపారం చేయాలనే అవగాహన లేకనో ఆగిపోతుంటారు. అయితే పల్లెటూర్లలో ఉంటే పరిస్థితులకు తగ్గట్లు చేసే వ్యాపారాలు సక్సెస్‌ అవుతాయి. ఊర్లో 90 శాతం మంది ఆధారపడేది వ్యవసాయంపైనే, దానికి అనుబంధమైన వ్యాపారం మొదలుపెడితే తిరుగు ఉండదు. ఇప్పుడు అలాంటి వ్యాపారం గురించే తెలుసుకుందాం..

ఎరువులు, ఫెర్టిలైజర్‌ షాప్‌ను రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పెడితే మంచిగా సక్సెస్‌ అవ్వొచ్చు. పంటలకు అవసరమైన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులను సరసమైన ధరలకు విక్రయిస్తూ వ్యాపారం చేయొచ్చు. పైగా ఇది ఒక రకంగా రైతులకు, వ్యవసాయ రంగానికి సేవగా కూడా భావించాలి. ఎందుకంటే.. కాలానికి తగ్గట్లు ఏ మందు కొడితే పంటకు మంచిదో, ఏ రోగం వస్తే ఎలాంటి పురుగు మందులు పిచకారి చేయాలనేది రైతులకు వివరిస్తూ ఒక రకంగా వారికి గైడ్‌గా కూడా వ్యవహరించవచ్చు. వారికి మంచి చేస్తూనే వ్యాపారం కూడా వృద్ధి చేసుకోవచ్చు.

సమాజంలో గౌరవం..

ఊర్లలో ఎరువుల షాపు నిర్వహించే వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎందుకంటే వారు నిత్యం రైతులతో మాట్లాడుతూ ఉంటారు. వారిచ్చిన ఎరువులు, పురుగుల మందులు బాగా పని చేసి పంట దిగుబడి బాగా వస్తే ఆ రైతు, ఆ వ్యాపారికి కృతజ్ఞతలు తెలుపుతుంటారు. మీరిచ్చి మందులతోనే మంచి దిగుబడి వచ్చిందని ఆ ఏడాదంతా చెప్పుకుంటూ ఉంటాడు. అలాగే చాలా మంది రైతులకు ఈ వ్యాపారంలో ఖాతాలు పెట్టాల్సి వస్తుంది. తమను సమయానికి ఆదకుంటూ, పంట నష్టపోకుండా చేసే వ్యక్తి అంటూ రైతులంతా వ్యాపారిని గౌరవ భావంతో చూస్తారు. అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టేందుకు ఓ రూ.5 లక్షల పెట్టుబడితో పాటు పలు లైసెన్సులు అవసరం అవుతాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us