డాలర్(Dollar)తో రూపాయి(Rupee) మారకం విలువ నేడు భారీగా క్షీణించింది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌కు రూపాయి 77.28కి పడిపోయింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి 76.93 వద్ద ముగిసింది. ఈరోజు 0.48 శాతం క్షీణించింది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ బలహీనత, ద్రవ్యోల్బణం(Inflation) ఆందోళనల కారణంగా రూపాయి సోమవారం 77.06 వద్ద ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే 77.31 వద్ద రికార్డు స్థాయికి పడిపోయింది. చివరిసారిగా మార్చి 7, 2022న రూపాయి 79.98 కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం సామాన్యులపైనా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతోంది. బలహీనమైన రూపాయి కారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు మరింత ఖరీదైనవిగా మారతాయి. అయితే, ఎగుమతిదారులకు రూపాయి బలహీనత అదనపు ఆదాయాన్ని ఇస్తుంది.
ఇటీవలి కాలంలో రూపాయి మారకం విలువ క్షీణించడం వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు(Foreign exchange reserves) పడిపోయాయి. భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడరల్ రిజర్వ్(Fedaral Reserv) వడ్డీరేట్ల పెంపు సరిపోతుందా అని వ్యాపారులు ప్రశ్నించారు. అదే సమయంలో చైనా నాయకులు జీరో-కోవిడ్‌పై హెచ్చరిస్తున్నారు, అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తన వడ్డీ రేట్లను పెంచేటప్పుడు మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అధిక ముడి చమురు ధరలు, రష్యా, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధంపై అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచింది. రూపాయి బలహీనత కారణంగా వస్తువులను కొనడానికి దేశం ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దిగుమతి చేసుకున్న వస్తువులు మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఇందులో ముడి చమురు, బంగారం మొదలైనవి ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ వస్తువుల ధర డాలర్లలో నిర్ణయిస్తారు.