Rupee: రికార్డుస్థాయిలో పతనమైన రూపాయి.. డాలర్‌తో పోలిస్తే 77.81 చేరిన భారతీయ కరెన్సీ..

|

Jun 09, 2022 | 4:17 PM

డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌కు 77.81 స్థాయిని తాకింది. అంతకుముందు మే 17న డాలర్‌కు రూపాయి 77.7975 స్థాయిని తాకింది...

Rupee: రికార్డుస్థాయిలో పతనమైన రూపాయి.. డాలర్‌తో పోలిస్తే 77.81 చేరిన భారతీయ కరెన్సీ..
Money
Follow us on

డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌కు 77.81 స్థాయిని తాకింది. అంతకుముందు మే 17న డాలర్‌కు రూపాయి 77.7975 స్థాయిని తాకింది. బుధవారం అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 77.68 వద్ద ముగిసింది. రూపాయి బలహీనపడటం సామాన్యులపైనా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపనుంది. రూపాయి విలువ తగ్గడం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను ఖరీదైనదిగా చేస్తుంది. అయితే, ఎగుమతిదారులకు రూపాయి బలహీనత అదనపు ఆదాయాన్ని తీసుకోస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. 5 వారాల్లో ఇది రెండో పెరుగుదల. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం బుధవారం క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ.2,484.25 ఉపసంహరించుకున్నారు.

రూపాయి బలహీనతతో దిగుమతికి దేశం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న వస్తువులు మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఇందులో ముడి చమురు, బంగారం కూడా ఉన్నాయి ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ వస్తువుల ధర డాలర్లలో నిర్ణయిస్తారు. రూపాయి బలహీనపడటం వల్ల నష్టాలే కాకుండా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేసే వస్తువులకు కూడా మంచి డబ్బు లభిస్తుంది. విడిభాగాలు, టీ, కాఫీ, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఉత్పత్తులు, మాంసం వంటి ఉత్పత్తులు భారతదేశం నుంచి ఎగుమతి ఎగుమతి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి