
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం నిరుపేదలకు బాగా ఉపయోగపడింది. దేశంలో ఒక రకంగా ఆర్థిక విప్లవాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. బ్యాంకు ఖాతాలేని ప్రతి ఒక్కరి చేత జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించేందుకు ఇది దోహదపడింది. అనంతర కాలంలో ఈ ఖాతాలు డిజిటల్ పేమెంట్లకు బాగా ఉపకరించాయి. వెరసి కింద స్థాయిలో పనిచేసే వ్యక్తులు డిజిటల్ పేమెంట్లు చేసే అవకాశం ఏర్పడింది. ఈ ఖాతాల వారికి తొలిసారిగా రూపే డెబిట్ కార్డులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. ఆ తర్వాత కాలంలో మిగిలిన ఖాతా దారులకు వీటిని వర్తింపజేశారు. అయితే ఈ రూపే కార్డును అందరూ కలిగి ఉంటున్నా.. దాని ద్వారా వచ్చే ప్రయోజనాలపై చాలా మందికి అవగాహన లేదు. ఈ రూపే డెబిట్ కార్డుపై ఉచితంగా రూ. 10లక్షల బీమా సదుపాయం ఉందన్న విషయం కూడా తెలీదు. ఈ నేపథ్యంలో ఈ రూపే కార్డులపే ఉన్న ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మన దేశంలో తొమ్మిదేళ్ల క్రితం రూపే డెబిట్ కార్డుల జారీ ప్రారంభమైంది. ఇది గ్లోబల్ కార్డ్ నెట్వర్క్స్ వీసా, మాస్టర్‌కార్డ్‌లకు దీటుగా ఎదిగింది. ఇటీవలె రూపే క్రెడిట్ కార్డులు, వాటిపై యూపీఐ సదుపాయాలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మన దేశంతో పాటు భూటాన్, సింగపూర్, యూఏఈ, నేపాల్ దేశాలకు సైతం రూపే కార్డ్ విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం 1,100 పైగా ప్రభుత్వ, ప్రైవేట్, రీజనల్ రూరల్, కోఆపరేటివ్ బ్యాంకులు రూపే కార్డులను జారీ చేస్తున్నాయి. మన దేశంలో ఇప్పటి వరకూ 67 కోట్లకు పైగా రూపే డెబిట్ కార్డులు ఉన్నాయి. వీటిలో 33 కోట్లకు పైగా కార్డులు కేవలం జన్ ధన్ ఖాతాలకు సంబంధించినవే కావడం విశేషం. రూపేలో క్లాసిక్, ప్లాటినం, సెలెక్ట్ పేరుతో కార్డులు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..