Dixon shares: ఐదు రోజుల్లో రూ.1.50 లక్షల ఆదాయం.. ఈ షేర్లు ఉన్న వారికి వద్దంటే డబ్బు

|

Dec 18, 2024 | 7:00 PM

దీర్ఘకాలంలో అధిక రాబడిని సంపాదించడానికి స్టాక్ మార్కెట్ లో పెటుబడులు అనుకూలంగా ఉంటాయి. వీటి వల్ల కొంచెం రిస్క్ ఉన్నా లాభాలు మాత్రం అధికంగా వస్తాయి. ఈ కారణంతోనే ఇటీవల స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. బ్యాంకులు, పోస్టాఫీసుల్లోని ఫిక్స్ డ్ డిపాజిట్ కు సాధారణంగానే ప్రజల ఆదరణ చాలా బాగుంటుంది. వాటితో పాటు ఇప్పుడు స్టాక్ మార్కెట్ పై ఆసక్తి చూపుతున్నారు. వాటిలో సొంతంగా పెట్టుబడులు పెడుతున్నారు. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

Dixon shares: ఐదు రోజుల్లో రూ.1.50 లక్షల ఆదాయం.. ఈ షేర్లు ఉన్న వారికి వద్దంటే డబ్బు
Follow us on

కొన్ని స్టాక్ లు పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తున్నాయి. రూపాయికి పదింతల లాభం చేకూర్చుతున్నాయి. తక్కువ కాలంలోనే అధిక రాబడిని ఆర్జిస్తున్నాయి. ఇలాంటి వాటిలో డిక్సన్ టెక్ కంపెనీ షేర్లు ముందు వరుసలో ఉంటాయి. ఇవి 2024లో దాదాపు 190 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. డిక్సన్ టెక్నాలజీ కంపెనీ ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులను తయారు చేస్తుంది. ఇది 2017లో స్టాక్ మార్కెట్ లో లిస్టు అయ్యింది. మధ్యలో కొంచెం తడబడినా ఎక్కువ కాలం విజయవంతంగా నడుస్తోంది. పెట్టుబడిదారులకు రాబడిని ఆర్జించిపెడతోంది. ఈ కంపెనీ షేర్లు డిసెంబర్ 17వ తేదీన ఐదు శాతం లాభాలను సంపాదించాయి. గత ఐదు రోజులుగా ఈ బాటలోనే కొనసాగుతున్నాయి. గడచిన రెండు వారాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే క్షీణతను చూశాయి. మొత్తానికి ఈ ఏడాది దాదాపు 190 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.

డిక్సన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడానికి వివో ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బైండింగ్ టర్మ్ షీట్ పై సంతకాలు కూడా పూర్తయ్యాయి. దీంతో డిక్సన్ కంపెనీ షేర్లకు విజయవంతంగా ట్రేడ్ అయ్యాయి. వివో ఇండియాతో పాటు ఇతర కంపెనీలకు కూడా ఓఈఎంలను అందజేయనుంది. జాయింట్ వెంచర్ లో డిక్సన్ 51 శాతం, వివో మిగిలిన వాటాను కలిగి ఉన్నాయి. మరే ఇతర కంపెనీకి దీనిలో వాటా ఉండదు. అయితే డిక్సన్, వివో కంపెనీలకు ఒకదానిలో మరోదానికి ఎలాంటి వాటాలు ఉండవు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ దేశంలో వివో ఓఈఎం ఆర్డర్లను స్వీకరించడంతో పాటు ఇతర బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కాంటాక్టులు చేపడుతుంది. ఆ ఉత్పత్తి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

డిక్సన్ టెక్నాలజీస్ వైస్ చైర్మన్, ఎంపీ అతుల్ బి.లాల్ ఇటీవల మాట్లాడుతూ దేశంలోని ఆండ్రాయిడ్ మార్కెట్ లో తమ జాయింట్ వెంచర్ విజయవంతమవుతుందని ఆశిస్తున్నామన్నారు. తమ తయారీ నైపుణ్యం, ఉన్నత సామర్థ్యంపై నమ్మకమే దీనికి కారణమన్నారు. జపాన్ కు చెందిన ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ అయిన నోమురా ఇటీవల డిక్సన్ టెక్నాలజీ షేర్లకు సిఫారసులు చేసింది. వాటిని రూ.18,654 కొనుగోలు చేయవచ్చని సూచించింది. కాగా.. డిక్సన్ టెక్నాలజీ షేర్లు డిసెంబర్ లోనే 28 శాతం రాబడిని అందించాయి. గత ఆరు నెలల్లో ఈ పెరుగుదల 64 శాతంగా ఉంది. పెట్టుబడి దారుడి దగ్గర డిక్సన్ షేర్లు సుమారు 100 ఉన్నాయనుకోండి. అతడు ఈ ఐదు రోజుల్లోనే రూ.1.50 లక్షల సంపాదించినట్టు అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి