Royal Enfield: ‘రాయల్‌’గా ఎంట్రీ ఇచ్చిన డుగ్గు డుగ్గు బండి.. కొత్త జనరేషన్ కోసం సరికొత్త బైక్.. పూర్తి వివరాలు ఇవి..

|

Sep 01, 2023 | 4:15 PM

రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఆ పేరులోనే రాజసం ఉట్టిపడుతుంది. మార్కెట్లో ఎన్ని బైక్ లు ఉన్నా దీని తీరే వేరు.. స్టైలే వేరు. యువతకు కలల బైక్ ఇది. దాని బీటింగ్ కోసమే బైక్ వాడేవారుంటారు. ఇప్పటికే పలు రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మోడల్ దేనికదే ప్రత్యేకం. ఈ క్రమంలో కంపెనీ నుంచి మరో బైక్ శుక్రవారం లాంచ్ అయ్యింది. న్యూ జనరేషన్ బుల్లెట్ 350 పేరిట దీనిని ఆవిష్కరించింది.

Royal Enfield: ‘రాయల్‌’గా ఎంట్రీ ఇచ్చిన డుగ్గు డుగ్గు బండి.. కొత్త జనరేషన్ కోసం సరికొత్త బైక్.. పూర్తి వివరాలు ఇవి..
Bullet 350 Motorcycle
Follow us on

రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఆ పేరులోనే రాజసం ఉట్టిపడుతుంది. మార్కెట్లో ఎన్ని బైక్ లు ఉన్నా దీని తీరే వేరు.. స్టైలే వేరు. యువతకు కలల బైక్ ఇది. దాని బీటింగ్ కోసమే బైక్ వాడేవారుంటారు. ఇప్పటికే పలు రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మోడల్ దేనికదే ప్రత్యేకం. ఈ క్రమంలో కంపెనీ నుంచి మరో బైక్ శుక్రవారం లాంచ్ అయ్యింది. న్యూ జనరేషన్ బుల్లెట్ 350 పేరిట దీనిని ఆవిష్కరించింది. దీని ఎక్స్ షోరూం ధరలు ఇలా ఉన్నాయి. బేస్ వేరియంట్ రూ. 1,73,562 ఉండగా, మిడ్ రేంజ్ వేరియంట్ ధర రూ. 1,97,436, టాప్ వేరియంట్ ధర రూ. 2,15,801గా ఉంది. రాయల్ ఎన్ ఫీల్డ్ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 మోటార్ సైకిల్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బుకింగ్స్ ప్రారంభం..

న్యూ జనరేషన్ బుల్లెట్ 350 బైక్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న హంటర్ 350, క్లాసిక్ 350లకు మధ్య రకంగా అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. డెలివరీలు సెప్టెంబర్ 3 నుంచి మొదలవుతాయి. ఈ బైక్ హోండా హానెస్ సీబీ350, జావా ఫార్టీ టూ వంటి 350సీసీ మోటార్ సైకిల్స్ తో పోటీ పడనుంది.

లెగసీ కొనసాగిస్తున్నాం..

రాయల్ ఎన్ ఫీల్డ్ లెగసీని నిరంతర కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ బి. గోవిందరాజన్ చెప్పారు. న్యూ జనరేషన్ బుల్లెట్ 350 బైక్ లాంచింగ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను జోడిస్తూ.. సరికొత్త అప్ డేట్లతో న్యూ లుక్ లో బైక్ ను తీసుకొస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

బైక్ స్పెసిఫికేషన్లు..

ఐచర్ మోటార్ కు చెందిన ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్ లో జే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది హంటర్ 350, క్లాసిక్ 350, మీటీర్ 350 వంటి పనితీరుని కనబరుస్తుంది. దీని స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే 349సీసీ సింగిల్ సిలెండర్, ఎయిర్-ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20హెచ్ పీ, గరిష్టంగా 27ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు గేర్లు ఉంటాయి.

డిజైన్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. కొత్తగా రూపొందించిన హెడ్ లైట్లు, వెనుక లైట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది మొత్త ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మిలటరీ రెడ్, మిలటరీ బ్లాక్, స్టాండర్డ్ మరూన్, స్టాండర్డ్ బ్లాక్, బ్లాక్ గోల్డ్ రంగుల్లో లభిస్తోంది.

ఫీచర్ల విషయానికి వస్తే దీనిలో కొత్తగా డిజిటల్ అనలాగ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఎల్సీడీ స్క్రీన్ తో ఉంటుంది. హ్యాండిల్ బార్ కూడా కొత్తగా ఇచ్చారు. యూఎస్బీ పోర్టు ఉంటుంది. ఇదే బైక్ ను అక్టోబర్ చివరి నాటికి యూరోప్ లో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..